అనురాధ దంపతుల హత్య: చింటూ అనుచరుడి ఇంట్లో పోలీసు సోదాలు
చిత్తూరు : మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ల హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వారి మేనల్లుడు చంద్రశేఖర్ అలాయాస్ చింటూ అనుచరుడు పరంధామం ఇంట్లో ఆదివారం పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఏడు హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్, కాల్ రికార్డింగ్ డేటా, ఫొటోలను పోలీసులు సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పోలీసులు చింటూ కార్యాలయంలో ఆదివారం ఉదయం సోదాలు నిర్వహించగా కత్తులు, కటార్లు లభ్యమైన విషయం తెలిసిందే. తాజాగా చింటూ అనుచరుడు పరంధామం ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

చింటూ సెల్ నెంబర్‌కు మూడు నెలలుగా వచ్చిన ఇన్ కమింగ్ కాల్స్, ఔట్ గోయింగ్ కాల్స్ జాబితాను పోలీసులు తీసుకున్నారు. ఇందులోని ప్రతీ కాల్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారు. చింటూకు సన్నిహితంగా కొంత మంది ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీళ్లకు హత్యతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తు్నారు.
గంగనపల్లికి చెందిన ఇద్దరిని, సంతపేటకు చెందిన ఓ వ్యక్తిని, ఎస్టేట్‌కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సంతపేటకు చెందిన అధికార పార్టీ కార్పోరేటర్ భర్తను విచారణ చేయడానికి ప్రయత్నిస్తుండగా అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications