నెల్లూరులో సిమీ ఉగ్రవాదుల కదలికలు: ఏపీ డీజీపీ
విజయవాడ: త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేస్ డీజీపీ రాముడు తెలిపారు. శుక్రవారం ఉదయం కడప జిల్లా పోలీసు అధికారులతో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
నెల్లూరు జిల్లాలో సిమీ ఉగ్రవాదుల కదలికలున్నాయని చెప్పిన ఆయన ఉగ్రవాదుల కోసం సోదాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలపై మరింత నిఘా పెంచామన్నారు. కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డిని దేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications