చింటూ గొడవను వాడుకున్నారా: అనురాధ హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందా?
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. హత్యకు సూత్రధారి చింటూయేనా? రాజకీయ కుట్ర దాగి ఉందా? దుండగులకు సహకరించిందెవరు? కటారి మోహన్ - చింటూల మధ్య ఉన్న గొడవను ఇంకెవరైనా ఉపయోగించుకున్నారా?.. ఇలా అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
ముఖ్యంగా మేయర్ హత్యోదంతంలో చింటూ పాత్ర ఏ మేరకు ఉంది అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సికె బాబు అనుచరుల పాత్ర పైన కూడా అనుమానాలు ఉన్నట్లు డిజిపి జేవీ రాముడు చెప్పారు.
చింటూ కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు. చింటూకు, కటారి మోహన్‌కు ఎక్కడ విభేదాలు వచ్చాయి, చింటూకు ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. చింటూ సన్నిహితుల నుంచి పోలీసుల వివరాలు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.

చింటూకు, కటారి మోహన్ కుటుంబానికి మధ్య గల ఘర్షణను ఎవరైనా వాడుకున్నారా అనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. చింటూను ఇటీవల ఎవరెవరు కలిశారనే విషయమై సమాచారం సేకరిస్తున్నారు.
మరోవైపు, మొబైల్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. చింటూ, మోహన్ మధ్య హత్య చేసే స్థాయిలో గొడవలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
చింటూ ఇంట్లో దొరికిన ఆధారాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు, చిత్తూరు నగర పాలక సంస్థలోని సిసి కెమెరాలను ఎవరెవరు కట్ చేశారనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు. సిసి కెమెరాల్లో ఎలాంటి మరమ్మతులు లేవని, కాబట్టి ఉద్దేశ్య పూర్వకంగానే వైర్లను కట్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications