జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై కేసీఆర్ రాజ‌కీయ ''బ్ర‌హ్మాస్త్రం''?

పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దవటం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ సినిమాకు ముఖ్యఅతిథిగా జూనియ‌ర్ ఎన్టీఆర్ హాజ‌రు కావాల్సి ఉంది. ర‌ణ‌బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్‌తోపాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగులో ఈ సినిమాను రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఫంక్షన్ కు తెలంగాణ పోలీసుల నుంచి అమ‌నుతి రాలేదు.

 రాజకీయ కోణంలో చూస్తోందా?

రాజకీయ కోణంలో చూస్తోందా?

ఫంక్ష‌న్ నిర్వ‌హించేందుకు ఈ చిత్ర యూనిట్ తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి ముందే అనుమ‌తి తీసుకుంది. అయితే ఫంక్ష‌న్‌కు ఒక‌రోజు ముందు పోలీసులు అనుమ‌తిని ర‌ద్దుచేశారు. వాస్త‌వానికి సినిమా ఫంక్ష‌న్ల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులివ్వ‌డం, త‌ర్వాత ర‌ద్దుచేయ‌డం సాధార‌ణంగానే జ‌రుగుతుండేది. కాక‌పోతే ఇక్క‌డ ర‌ద్ద‌యిన కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథి జూనియ‌ర్ ఎన్టీఆర్ కావ‌డంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ ర‌గ‌డ రాజుకుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని కూడా కేసీఆర్ ప్ర‌భుత్వం రాజ‌కీయ కోణంలో చూస్తోందా? అనే చ‌ర్చ న‌డుస్తోంది.

 అభినందించడానికే కలిశానన్న షా!

అభినందించడానికే కలిశానన్న షా!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి భేటీకి ముందు అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీరావును కూడా క‌లిసొచ్చారు. ఒకేరోజు ఇద్ద‌రు ప్ర‌ముఖుల‌తో అమిత్ షా జ‌రిపిన భేటీ రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని వేడెక్కించింది. ఇవ‌న్నీ భార‌తీయ జ‌న‌తాపార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు స్థానిక నేత‌లు ప్ర‌య‌త్నించారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను కాబ‌ట్టి అభినందించ‌డానికి క‌లిశాన‌ని షా చెప్పారు. అయితే రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీకి అనుకూలంగా ప్ర‌చారం చేయ‌మ‌ని జూనియ‌ర్‌ను షా కోరారంటూ వార్త‌లు పుంఖాను పుంఖ‌లుగా వెలువ‌డ్డాయి.

 బందోబస్తుకు సరిపడా పోలీసులు లేకపోవడంవల్లే..

బందోబస్తుకు సరిపడా పోలీసులు లేకపోవడంవల్లే..


తాజాగా బ్ర‌హ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు అనుమ‌తులివ్వ‌క‌పోవ‌డం వెన‌క రాజ‌కీయం ఉందంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ముందుగా అనుమ‌తిచ్చిన‌ట్లే ఇచ్చి త‌ర్వాత ర‌ద్దుచేయ‌డం వెన‌క కూడా తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ వ్యూహం దాగివుందంటున్నారు. ఎందుకు ర‌ద్దు చేశార‌నే విష‌యాన్ని ప్ర‌భుత్వం చెప్పింది. బందోబ‌స్తుకు స‌రిప‌డా సిబ్బంది లేక‌పోవ‌డంవ‌ల్ల అనుమ‌తివ్వ‌డంలేద‌ని తెలియ‌జేసింది. కాక‌పోతే ఇదంతా రాజ‌కీయ కోణంలోనే జ‌రిగిందంటూ వార్తలు మాత్రం వెలువ‌డుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+