చంద్రబాబు - పీకే భేటీలో ఏం జరిగింది: జగన్ బలం ఇదే, 2024 గెలుపు పై క్లారిటీ..!!

టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ సమావేశం అందరూ భావిస్తున్నట్లు ఆకస్మికంగా జరిగింది కాదు. చంద్రబాబు అరెస్ట్ తరువాత లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే టీడీపీకి పని చేయాలని కోరారు. చంద్రబాబు ఈ మధ్య కాలంలోనే పీకేతో జూమ్ సమావేశంలో చర్చించారు. ఇప్పుడు చంద్రబాబు ఆహ్వానం మేరకు ఉండవల్లికి వచ్చారు. ఈ భేటీలో జగన్ బలం వివరించటంతో పాటుగా కొన్ని సూచనలు చేసారు.

రాజకీయంగా ఆసక్తి
ప్రశాంత్ కిషోర్ ఉండవల్లి వచ్చి చంద్రబాబుతో భేటీ అవ్వటం పైన రాజకీయంగా ఆసక్తిని పెంచింది. జగన్ బలం - బలహీనతలు తెలిసిన వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పని చేస్తారా.. గెలిపిస్తారా అనే చర్చ మొదలైంది. అయితే..తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయటం లేదని..ఐ ప్యాక్ తోనూ సంబంధం లేని పీకే క్లారిటీ ఇచ్చారు.

Political heat surges after meeting of prashant kishor and chandrababu ahead AP Elections

కానీ..చంద్రబాబు అభ్యర్దన మేరకు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయనే దాని పైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలయ్యే వారకూ ప్రతీ 15 రోజులకు ఒక సారి చంద్రబాబుతో ఒక సమావేశానికి పీకే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక.. జగన్ సంక్షేమ పథకాలు..గ్రామీణ ఓటర్లలో అనూహ్యంగా బలపడ్డారని. కొన్ని అంశాల్లో ప్రతికూతలత ఉన్నా..నష్టం చేసే స్థాయిలో లేదని వివరించినట్లు సమాచారం.

పొత్తులు - అభ్యర్దులు
టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే స్థానాలు..జనసేనతో వెళ్లటం ద్వారా గెలిచే అవకాశం ఉన్న స్థానాల పైన వేర్వేరుగా ప్రశాంత్ కిషోర్ పలు సర్వే సంస్థల నుంచి సేకరించిన సమాచారం అందించారు. పొత్తులో భాగంగా రెండు పార్టీల అభ్యర్దులను వీలైనంత త్వరగా ఖరారు చేసి ప్రజల్లోకి పంపాలని సూచించారు.

బీజేపీతో పొత్తుతో నష్టం తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. టీడీపీ -జనసేన పొత్తు కారణంగా ఏదో జరిగిపోతుందనే హైప్ క్రియేట్ చేస్తూ ప్రజలను ఆకట్టుకొనే అంశాలను ఇప్పటి వరకు విస్మరించారని పేర్కొన్నారు. తంలో ఇచ్చిన హామీలు చేయలేదు అనే బ్లాక్ మార్క్ ఉన్నందున ఈ సారి కీలకమైన10 హామీలను ఎంపికి చేసి వాటి పైనే ప్రధానంగా ప్రచారం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఇలా చేయండి
అదే సమయంలో జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పటం ద్వారా ఆ పథకాలు బాగున్నాయని.. వాటినే కొనసాగిస్తామని టీడీపీ చెప్పటం జగన్ కు సర్టిఫికెట్ ఇవ్వటమేనే అభిప్రాయం వ్యక్తం చేసారు. సంక్షేమo గురించి తక్కువ మాట్లాడి... అభివృద్ధి గురించి ఎక్కువగా చెప్పుకోవాలని సలహా ఇచ్చారని సమాచారం.

అమరావతి గురించి ఆ ప్రాంతంలో మినహా ఎక్కువగా ప్రస్తావన చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది. జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నష్టం తప్పదని హెచ్చరించారు. పాలనాపరమైన లోపాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం జగన్ పాలన పైన కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తున్నా..దానిని అందిపుచ్చుకోవటంలో టీడీపీ సక్సెస్ కావటం లేదనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+