Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముగిసిన పవన్ డెడ్ లైన్ - సీఎం జగన్ డోన్ట్ కేర్ : వాట్ నెక్స్ట్ -వైసీపీ వ్యూహం పక్కా ...!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ ను జగన్ లెక్కచేయలేదు. విశాఖ కేంద్రంగా జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. వారంలోగా స్టీల్ ప్లాంట్ పైన వైసీపీ ప్రభుత్వం తమ విధానం స్పష్టం చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. కేంద్రాన్ని ప్రశ్నించే మందు రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుందన్నారు. లేఖలతో తమ చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెట్టవద్దంటూ పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారని చెబుతూ..తన వెనుక ఒక్క ఎంపీ కూడా లేరని...ఒక్క ఎంపీ ఉన్నా..తాను ఏం చేసేవాడినో నిరూపించేవాడినని చెప్పుకొచ్చారు.

పవన్ డెడ్ లైన్ ను లెక్క చేయని సీఎం

పవన్ డెడ్ లైన్ ను లెక్క చేయని సీఎం

ముందుగా అఖిలపక్షం ఏర్పాటు చేయాలంటూ జనసేన అధినేత డిమాండ్ చేసారు. తమ పార్టీతో సహా మేధావులను సైతం ఆహ్వానించాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం నుంచి వారంలోగా స్పందన రాకుండా తమ కార్యాచరణ ఏంటో వెల్లడిస్తామని పవన్ చెప్పుకొచ్చారు. అయితే, పవన్ ఫిక్స్ చేసిన వారం రోజుల సమయం ముగిసిపోయింది. ఏపీ ప్రభుత్వం నుంచి పవన్ చేసిన వ్యాఖ్యల పైన కౌంటర్లు మినహా.. డెడ్ లైన్..అఖిల పక్షం పైన మాత్రం క్లారిటీ రాలేదు. అసలు పవన్ డెడ్ లైన్ ను జగన్ తో సహా మంత్రులు సైతం పట్టించుకోలేదు.

ఇప్పటికే ప్రధానికి లేఖలు.. అసెంబ్లీలో తీర్మానం

ఇప్పటికే ప్రధానికి లేఖలు.. అసెంబ్లీలో తీర్మానం

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రధానికి వరుసగా లేఖలు రాసారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరించ కుండానే ఏ విధంగా కొనసాగించవచ్చో సూచించారు. అఖిలపక్షం తో కలిసేందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. అయితే, ప్రధాని కార్యాలయం నుంచి దీని పైన స్పందన రాలేదు.

రాష్ట్ర స్థాయిలో దీని పైన చేయటానికి ఏమీ లేదని..మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్..ఇప్పుడు తాము స్పందించకపోతే ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలనే ఉద్దేశంతో వైసీపీ కనిపిస్తోంది. కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయటం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందనేది వైసీపీ నేతల వాదన.

బీజేపీకి వ్యతిరేకంగా పవన్ పోరాటం చేస్తారా

బీజేపీకి వ్యతిరేకంగా పవన్ పోరాటం చేస్తారా

దీంతో..ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న పవన్ ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారు... బీజేపీని ఎలా నిలదీస్తారో చూడాలంటే ..తాము జనసేనాని డెడ్ లైన్ కు స్పందించకూడదని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా ఏం చేయాలని పవన్ నిర్ణయించినా..ఖచ్చితంగా అది కేంద్రంలోని బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. డెడ్ లైన్ ముగిసిన తరువాత ఈ అంశం పైన పవన్ క్లారిటీతో ముందుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పుడుతుందనేది వైసీపీ నేతల అంచనా. అయితే, తాజాగా పవన్ ఈ అంశం పైన ఈ రోజున వరుసగా ట్వీట్లు చేసారు.

పవన్ తాజా ట్వీట్లలో నాటి అంశాలు

పవన్ తాజా ట్వీట్లలో నాటి అంశాలు

స్టీల్ ప్లాంట్ కోసం జరిగిన పోరాటాల పైన ఆ సమయంలో వచ్చిన పత్రికా క్లిప్పింగులు... ప్రాణత్యాగం చేసిన వారి వివరాలను ఆ ట్వీట్ లో వివరించారు. అయితే, వైసీపీ ప్రభుత్వం స్పందించకపోవటం పైన జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. అదే సమయంలో కేంద్రంలోని మంత్రులు..బీజేపీ నేతలు మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఖాయమని స్పష్టంగా చెబుతున్నారు. తాజాగా ఏపీ బీజేపీ నేతలు సైతం ప్రయివేటీకరణ ద్వారా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

పవన్ నిర్ణయం కోసం టీడీపీ వెయిటింగ్

పవన్ నిర్ణయం కోసం టీడీపీ వెయిటింగ్

ఇక, టీడీపీ సైతం పవన్ కార్యాచరణ కోసం వెయిట్ చేస్తోంది. జనసేన తో కలిసి స్టీల్ ప్లాంట్ కోసం కలిసి నడించేందుకు టీడీపీ సైతం సిద్దంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు తన తక్షణ కార్యాచరణలో భాగంగా జనసేన అధినేత పవన్ ముందుగా విశాఖలో స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీల నేతలను కలుపుకొని వెళ్లిన విధంగానే..ఈ కార్యక్రమానికి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది.

Recommended Video

    ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu
    రాజకీయంగా కొత్త సమీకరణాలకు ఛాన్స్

    రాజకీయంగా కొత్త సమీకరణాలకు ఛాన్స్

    అయితే, ఏం చేసినా...కేంద్రం..బీజేపీతో సంబంధాల పైన ఎటువంటి ప్రభావం చూపుతుందనే మీమాంస పవన్ ను వెంటాడుతోంది. దీంతో..ఈ రోజు లేదా రేపు పవన్ తన కార్యాచరణ స్పష్టం చేసే ఛాన్స్ ఉంది. దీనికి అనుగుణంగా వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యేందుకు వెయిట్ చేస్తున్నారు. ఇక, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కేంద్రంగా మరోసారి ఏపీ రాజకీయాలు హీటెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+