తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాల బ్యాన్-అమల్లోకి టీటీడీ నిర్ణయం..!
తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు నిషేధిస్తూ తాజాగా టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే తిరుమల కొండపై దర్శనానికి వస్తున్న రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో కొండ పవిత్రత దెబ్బతింటోందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా సమావేశమైన టీడీడీ కొత్త పాలకమండలి తొలి భేటీలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు.

తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిరక్షించేందుకు రాజకీయ ప్రసంగాలు చేయొద్దని ఎప్పటి నుంచో భక్తుల నుంచి డిమాండ్లు ఉన్నాయి. అయినా రాజకీయ నేతల చేతుల్లో కీలుబొమ్మగా ఉండే టీటీడీ ఇప్పటివరకూ దీనిపై సీరియస్ గా దృష్టిపెట్టలేదు. దీంతో రాజకీయ నేతలు శ్రీవారి దర్శనానికి వెళ్లడం, ఆలయం బయటికి రాగానే కొండ కూడా దిగకుండానే అక్కడే రాజకీయ వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో విపక్షంగా ఉన్న కూటమి టీటీడీ ప్రక్షాళనకు హామీ ఇచ్చింది. ఈ మేరకు కొత్త బోర్డు ఏర్పాటు కాగానే తొలి భేటీలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలతో పాటు రీల్స్ చేసుకోవడం వివాదాలు రేపుతున్న వేళ టీటీడీ నిర్ణయం ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తోంది. దీంతో ఇకపై రాజకీయ ప్రసంగాలు చేసే వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications