కేసీఆర్ జాతీయపార్టీతో ఏపీలో రాజకీయ ప్రకంపనలు.. ఉండవల్లి భేటీతో ఆ పార్టీలకు షాక్!!

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీని పెట్టాలని యుద్ధప్రాతిపదికన కసరత్తులు మొదలుపెట్టారు. త్వరలోనే కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ రాష్ట్రీయ సమితి పేరుతో జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని భావించిన కేసీఆర్ ఈ మేరకు నేతలు, మేధావులతో సమాలోచనలు జరుపుతున్నారు. అయితే జాతీయ రాజకీయాలపై కెసిఆర్ ఫోకస్ చేస్తున్న తీరుపై ఏపీ రాజకీయ పార్టీలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ జాతీయ పార్టీ

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ జాతీయ పార్టీ

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ను గద్దె దించడం లక్ష్యంగా జాతీయ రాజకీయాలలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు కేసీఆర్. ఈ మేరకు భారత్ రాష్ట్రీయ సమితి పేరుతో పార్టీని స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మోదీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకొని బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినా అది సఫలం కాలేదు. ఇక ఈ క్రమంలో దేశంలో ప్రతిపక్ష పార్టీని కాంగ్రెస్ పార్టీ పోషించలేక పోతుందని భావిస్తున్న కేసీఆర్, మరో ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి రంగంలోకి దిగుతున్నారు.

ఉండవల్లి అరుణ్ కుమార్ తో కేసీఆర్ భేటీతో కేసీఆర్ వ్యూహాలపై ఒక్కసారిగా ఏపీ దృష్టి

ఉండవల్లి అరుణ్ కుమార్ తో కేసీఆర్ భేటీతో కేసీఆర్ వ్యూహాలపై ఒక్కసారిగా ఏపీ దృష్టి

ఈ క్రమంలో ఆయన ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో తాజాగా సీఎం కేసీఆర్ ఏపీలో సీనియర్ రాజకీయ నేత అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ కావడం ఒక్కసారిగా ఏపీ రాజకీయ వర్గాల దృష్టిని కేసీఆర్ జాతీయ పార్టీపై మరలేలా చేసింది. కేసీఆర్ తో సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ కావడం ఏపీ రాజకీయాలలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే పార్టీలు లేవన్న భావన ప్రజలలో వ్యక్తమవుతుంది.

బీజేపీపై పోరాటం చేసే పార్టీ ఏపీలో లేదు.. బీజేపీ వ్యతిరేక నినాదంతో ఏపీలో బీఆర్ఎస్ వ్యూహం

బీజేపీపై పోరాటం చేసే పార్టీ ఏపీలో లేదు.. బీజేపీ వ్యతిరేక నినాదంతో ఏపీలో బీఆర్ఎస్ వ్యూహం

రానున్న ఎన్నికల్లో పొత్తుల నేపథ్యంలో బీజేపీ పై టీడీపీ ఆచితూచి మాట్లాడుతోంది. ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడుతుంది. ఇక అధికార వైసిపి కేంద్రంలోని బీజేపీని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. జనసేన, బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతూ కేంద్రం తీరును ప్రశ్నిస్తున్న దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని ప్రజలలో తీవ్రమైన అసహనం ఉంది. ఈ అసహనాన్ని వ్యక్తం చేసే రాజకీయ పార్టీలు ఏపీలో కొరవడడంతో, అలా బీజేపీపై పోరాటానికి తామున్నామంటూ ఏపీలో సైతం గులాబీ బాస్ జాతీయ పార్టీతో పాగా వేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు అన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాలలో ప్రస్తుతం వ్యక్తమవుతుంది. అదే జరిగితే ఆ పార్టీలకు షాక్ తగిలే అవకాశం లేకపోలేదు.

ఏపీలోనూ కేసీఆర్ పార్టీలో చేరికలకు పలువురు సిద్ధం

ఏపీలోనూ కేసీఆర్ పార్టీలో చేరికలకు పలువురు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ బిజెపిని వ్యతిరేకించే పార్టీలు కాకపోవడంతో, మోడీని గట్టిగా నిలదీసే పార్టీగా కెసిఆర్ ఏర్పాటుచేసే జాతీయ పార్టీ ఏపీలోనూ కాలు పెడుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. నిజంగా కేసీఆర్ జాతీయ పార్టీతో ఏపీలో కాలు పెడితే వివిధ ప్రజా సంఘాల నాయకులు, బీజేపీ వ్యతిరేక పాలనపై అసహనంతో ఉన్న మేధావులు ఆ పార్టీలో చేరడానికి ఆసక్తి కనబరుస్తారు అన్న చర్చ జరుగుతోంది. ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రమే కాదు, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు మేధావులు కెసిఆర్ పార్టీపై దృష్టి పెట్టినట్టుగా ప్రధానంగా కనిపిస్తుంది.

ఏపీలో కేసీఆర్ జాతీయ పార్టీతో అడుగు పెడితే సమూలంగా రాజకీయ పరిణామాలలో మార్పు

ఏపీలో కేసీఆర్ జాతీయ పార్టీతో అడుగు పెడితే సమూలంగా రాజకీయ పరిణామాలలో మార్పు

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన నేతలు కేసీఆర్ రాజకీయ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్న వేళ, కెసిఆర్ జాతీయ పార్టీ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేస్తే, వచ్చే ఎన్నికలలో ఏపీలో పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందా అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. ఏది ఏమైనా కెసిఆర్ ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీ తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయ పరిణామాలను సమూలంగా మార్చే అవకాశం లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+