జగన్ వర్సెస్ నారా లోకేష్: రాజుకున్న వ్యాఖ్యల వేడి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్‌కు మధ్య సమరంగా మారబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇరువురు నాయకులు తమ తమ వ్యాఖ్యలతో రాజకీయ యుద్ధానికి తెర తీశారు. ఇరువురి మధ్య మీడియా ప్రకటనల యుద్ధం కూడా ప్రారంభమైంది.

వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు ఆర్జించిన ఘనత జగన్‌కే ద క్కిందని నారా లోకేష్ ఇదివరలో బహిరంగంగా వ్యాఖ్యలు చేసి రాజకీయ సమరానికి తెర తీశారు.. అదేవిధంగా చంద్రబాబు కుటింబసభ్యులు నిర్వహిస్తున్న హెరిటేజ్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా లోకేస్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.

అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్రాభివృద్ధికి పాటుపడాల్సిన జగన్ ఎపి రాజధాని అమరావతికి ఏమాత్రం సహకరించవద్దంటూ లేఖ రాశాడని లోకేష్ ఆరోపణలు చేశారు. రాష్ట్రాభివృద్ధిని జగన్ అడుగడుగునా అడ్డుకుంటున్నాడని, రాజధానికి సంబంధించిన భూముల విషయంలో సైతం జగన్ తనదైన శైలిలో వ్యవహరించాడని ఆయన అన్నారు. అలాగే పట్టిసీమ ప్రాజెక్టు విషయంలోనూ భూములు ఇవ్వ కుండా రైతు లను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

political war between Nara Lokesh and YS Jagan

భోగాపురం విమా నాశ్రయం, బందరుపోర్టు నిర్మాణాలను అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు జగన్ సాగిస్తున్నాడని, కేవలం చంద్రాబాబు ప్రభుత్వానికి మంచి పేరు వస్తే వచ్చే ఎన్నికలల్లో తమ ఉనికి సైతం కనిపించదని భయపడుతున్న జగన్ ఈ తరహా పనలకు దిగజారుతున్నాడని లోకేష్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

ప్రత్యేక హోదాపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై లోకేష్ సరైన సమయంలో స్పందిస్తారని టిడిపి నేతలు వివరిస్తున్నారు. తెలుగు దేశం పార్టీలో యనమల, కేఈ, దేవినేని ఉమా తదితరులు జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ వర్సెస్ జగన్‌ల మధ్య పోటీ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+