ఏపీలో పెన్షన్ల తొలగింపుపై పొలిటికల్ వార్ : వైసీపీ వర్సెస్ టీడీపీ, ఆ పాపం వూరికే పోదన్న లోకేష్ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పెన్షన్ల వార్ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అర్హులైన వారికి ఇవ్వాల్సిన పెన్షన్ లను తొలగిస్తున్నారని, నిరుపేదలైన, ముసలివారైన అవ్వతాతలను కూడా తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అనర్హులను తొలగిస్తున్నామని, అనర్హులకు పించన్లు తొలగిస్తే ఏవో కొంపలు అంటుకున్నట్టు టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఒకరిమీద ఒకరు మాటల తూటాలను పేలుస్తున్నారు.

ఏపీలో పెన్షన్ల రగడ .. జగన్ సర్కార్ తీరుపై ప్రతిపక్షాల ధ్వజం

ఏపీలో పెన్షన్ల రగడ .. జగన్ సర్కార్ తీరుపై ప్రతిపక్షాల ధ్వజం

బడుగు జీవులకు ఇస్తున్న సామాజిక పెన్షన్లలో భారీగా కోత విధించి జగన్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఒక్క టిడిపి మాత్రమే కాకుండా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ల కోతపై సిపిఐ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది . సీఎంగా ప్రమాణస్వీకారం జరిగిన రోజున జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల పెంపు ఫైలుపై పెట్టిన తొలి సంతకమే అమలుకు నోచుకోవడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో వైసిపి సర్కార్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి. పెన్షన్లను యథాతథంగా కొనసాగించాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే పెన్షన్ నగదును మూడు వేల రూపాయలకు పెంచాలని, ఇదే సమయంలో తాజాగా విధించిన ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే ఇస్తామన్న నిబంధనను తొలగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

పెన్షన్ ల తొలగింపుపై టీడీపీ నేతల ఆగ్రహం .. లక్షలాది పెన్షన్లు తొలగిస్తున్నారని ఫైర్

పెన్షన్ ల తొలగింపుపై టీడీపీ నేతల ఆగ్రహం .. లక్షలాది పెన్షన్లు తొలగిస్తున్నారని ఫైర్

సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న పెన్షన్లను కట్ చేసుకుంటూ పోతుందని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు టిడిపి ఎమ్మెల్యే అశోక్ కూడా రాష్ట్రంలో ఈ నెలలో మూడు లక్షల పెన్షన్లను తొలగించారని వృద్ధులకు వితంతువులకు పెన్షన్ ఇవ్వడానికి చేతకాక సీఎం జగన్ చేతులెత్తేశారు అని పేర్కొన్నారు. వచ్చే నెలలో మరో 4 లక్షల పెన్షన్లను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు . పెన్షన్ రాలేదన్న ఆవేదనతో 12 మంది రాష్ట్రంలో మృతిచెందారని పేర్కొన్న బెందాళం అశోక్ ఈ హత్యలను ప్రభుత్వ హత్యలుగానే భావించాలని పేర్కొన్నారు.

పెన్షన్ లను తొలగిస్తున్నామని టీడీపీ దుష్ప్రచారం : సజ్జల అటాక్

పెన్షన్ లను తొలగిస్తున్నామని టీడీపీ దుష్ప్రచారం : సజ్జల అటాక్

ఇక టిడిపి నేతల విమర్శలకు వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పెన్షన్ ల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజల్లో అపోహలను కల్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ రాగానే 60 లక్షల మందికి పెన్షన్ ఇస్తోందని, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇచ్చిన దాని కంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తున్నామని అలాంటి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయే తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు.

కార్లలో తిరిగే వాళ్లకు, ఉద్యోగాలు చేసే వాళ్లకు పెన్షన్ ఇవ్వాలా ? వైసీపీ నేతల ప్రశ్న

కార్లలో తిరిగే వాళ్లకు, ఉద్యోగాలు చేసే వాళ్లకు పెన్షన్ ఇవ్వాలా ? వైసీపీ నేతల ప్రశ్న

అంతేకాదు తెలుగుదేశం పార్టీ ఆరోపణలకు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు . అనర్హులను తొలగిస్తే ఏదో కొంపలు అనుకున్నట్టు ఎందుకు రచ్చ చేస్తున్నారంటూ చంద్రబాబుపై, టీడీపీ నేతలపై ఆయన ధ్వజమెత్తారు.కార్లలో తిరిగే వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వాలా అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. కేవలం అనర్హులను మాత్రమే తొలగిస్తున్నామని, కానీ అర్హులను తొలగిస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు.

జగన్ కు లేఖ రాసిన సీపీఐ నేత రామకృష్ణ , భగ్గుమన్న లోకేష్

జగన్ కు లేఖ రాసిన సీపీఐ నేత రామకృష్ణ , భగ్గుమన్న లోకేష్

ఇక పెన్షన్ల తొలగింపుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రమాణ స్వీకారం రోజు తొలి సంతకం పెట్టిన పెన్షన్ల పథకమే సక్రమంగా అమలు కాకపోతే మిగతా పథకాల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. తొలగించిన పెన్షన్లను తిరిగి పునరుద్ధరించాలని ఆయన పేర్కొన్నారు. ఇక తాజాగా పెన్షన్లు పెంచుకుంటూ పోతాం అని చెప్పిన సీఎం జగన్ రాష్ట్రంలో భారీగా పెన్షన్ల కోత పెడుతున్నారని, పెన్షన్ లను తుంచుకుంటూ పోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెన్షన్ల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని జగన్ రెడ్డి మాట ఇచ్చి తప్పారని ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు .

పెన్షన్ ల తొలగింపు పాపం వూరికే పోదన్న లోకేష్

పెన్షన్ ల తొలగింపు పాపం వూరికే పోదన్న లోకేష్

గత రెండు నెలల్లో 2.30 లక్షల పెన్షన్లకు కోత పెట్టారని లోకేష్ ధ్వజమెత్తారు. వైసిపి పెడుతున్న మానసిక క్షోభ తట్టుకోలేక, పెన్షన్ ఆధారంగా బ్రతుకుతున్న 13 మంది ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్ మోహన్ రెడ్డి ఆశ చూపించి, ప్రస్తుతం అడ్డమైన కారణాలను చూపించి భారీగా పెన్షన్లను తొలగిస్తున్నారని ధ్వజ మెత్తారు. జగన్ కు ఇచ్చిన మాట మీద నిలబడే లక్షణం లేదన్నారు. ప్రతి అవ్వా, తాత దగ్గర నెలకు 500 రూపాయలు కొట్టేస్తున్నారని, ఇప్పుడు భారీగా పెన్షన్లను కోసేస్తున్న పాపం కూడా ఊరికే పోదని లోకేష్ ధ్వజమెత్తారు. తొలగించిన పెన్షన్లు తక్షణమే పునరుద్ధరించి వారందరికీ పెన్షన్లు చెల్లించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఆరోగ్య సమస్యలతో, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పెన్షన్లు తీసేయడం సబబు కాదని లోకేష్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+