చంద్రబాబు సొంత జిల్లాలో చెరువులో ఏం చేశారో తెలుసా ?, పెద్దిరెడ్డి !!
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో మరో భాగోతం వెలుగు చూసింది. పుంగనూరు. చౌడేపల్లి మార్గం మధ్యలోని లద్దిగం చెరువులో యంత్రాలు ఉపయోగించి ఏకంగా 70 అడుగుల లోతులో తవ్వేసి అందులో ఉన్న ఇసుక బయటకు తీసి అమ్ముకున్నారని వెలుగు చూసింది. పగలు రాత్రి అని తేడా లేకుండా యంత్రాలు సహాయంతో లద్దిగం చెరువులో ఇసుక తవ్వేస్తున్నారని వెలుగు చూసింది.
లద్దిగం చెరువు సుమారు 700 ఎకరాలకు పైగా ఉంది. సుమారు 1350 ఎకరాలకు పైగా చెరువు కింద ఆయకట్ట ఉంది. పరిసర ప్రాంతంలోని గ్రామస్తులు లద్దిగం చెరువు కింద ఉన్న భూముల్లో వ్యవసాయం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో లద్దిగం చెరువులో సుమారు 70 అడుగుల లోతును తవ్వోసి యంత్రాలతో ఇసుక బయటకు తీసి ఇతర ప్రాంతాలకు తరలించారని తెలిసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

లద్దిగం చెరువు పరిధిలోనే బండ్లపల్లె, తిరుమణ పల్లె, పుదిపట్ల, లద్దిగం ఏతూరు పంచాయతీలు ఉన్నాయి. లద్దిగం చెరువులో యంత్రాలతో ఇసుక బయటకు తీసి తరలిస్తున్నా అక్కడి రాజకీయ నాయకులను ఎదిరించలేక ఇంతకాలం పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు మౌనంగా ఉండిపోయారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొందరు రాజకీయ నాయకులు వారి పలుకుబడి ఉపయోగించి యంత్రాలతో ఇసుక బయటకు తీసి బయట ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చింది. అయితే పుంగనూరులో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. లద్దిగంకు చెందిన రెడ్డప్ప చిత్తూరు ఎంపీ అయ్యారు. ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఉండే ప్రాంతంలో ఇలా లద్దిగం చెరువులో అక్రమంగా ఇసుక బయటకు తీసి తరలిస్తుంటే ఎవరు ఏమీ మాట్లాడలేకపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా ఇసుక తవ్వి బయటకు తీసి తరలిస్తున్నారని తెలిసినా స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు మౌనంగా ఉండిపోయారని, అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications