ఏపిలో అరాచక పాలన, భయపడం: చంద్రబాబుపై తెలంగాణ జగన్ పార్టీ నేత పొంగులేటి ఫైర్
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు.
చంద్రబాబు సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటామన్నారు. ఎలాంటి బెదిరింపులకు తాము భయపడమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ 420 అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా, నారాయణస్వామి ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని చంద్రబాబు కుట్రపన్నుతున్నారని విమర్శించారు.
మిథున్ రెడ్డి ప్రజాదరణ ఉన్న నాయకుడని.. అది ఓర్వలేక మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ముసునూరు ఎమ్వార్వో వనజాక్షిపై దాడి చేసిన దెందులూరు టిడిపి ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications