మోడీపై పొన్నం నిప్పులు, ఇష్టం లేకున్నా: లగడపాటి
కరీంనగర్/విజయవాడ: భారతీయ జనతా పార్టీ తన అసలు రంగును బయటపెట్టుకుంటోందని కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ ఆదివారం విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
మోడీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయన్నారు. తెలంగాణ బిజెపి నాయకులు మోడీ వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రకు అన్యాయం జరగాలని తాము ఎప్పూడూ కోరుకోలేదని పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా చెప్పారు.

ఇష్టం లేకున్నా: లగడపాటి
తనకు రాజకీయాల నుండి వైదొలగాలని ఇష్టం లేకపోయినా, ఇచ్చిన మాటకు కట్టుబడి తప్పుకున్నానని లగడపాటి రాజగోపాల్ అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల, మత, ప్రాంత రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు.
తాను చెప్పిన మాటకు కట్టుబడే రాజకీయాల నుండి వైదొలిగానని, దీనిని కార్యకర్తలు అర్ధం చేసుకోవాలన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీను విమర్శించలేదని, ఒక్క విభజన విషయంలో కాంగ్రెస్ తీరును మాత్రమే వ్యతిరేకించానని స్పష్టం చేశారు. రాజకీయాలలో ఉండే సేవ చేయాల్సిన అవసరం లేదని, స్వచ్చంధ సంస్ధల ద్వారా విజజయవాడ ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications