నాగార్జున భూములపై విచారణ జరపండి: పొన్నం
న్యూఢిల్లీ: గురుకుల్ ట్రస్టు భూములను ఖాళీ తెలంగాణ ప్రభుత్వం ఖాళీ చేయిస్తోందని, అలాగే సినీ నటుడు నాగార్జున, సినీ నిర్మాత రామానాయుడు ఆస్తులపైనా విచారణ జరపాలని కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కెసిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేసి నెల రోజులైనా ఉద్యమకారులపై ఇంకా కేసులు ఎందుకు ఎత్తివేయలేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇంతవరకు ఎందుకు అమలు జరగలేదని ప్రశ్నించారు. రైతు రుణ మాఫీ చేస్తామని అన్నారని, కానీ ఇంత వరకు చేయలేదని, ఖరీఫ్ సీజన్ కూడా వెళ్లిపోతుందని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో కెసిఆర్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ ఇంతవరకు అమలు కాలేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచుతామని కెసిఆర్ హామీ ఇచ్చారని, ఒక్క సంతకంతో అయిపోయే పనులైనా ఆయన ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని పొన్నం అన్నారు.












Click it and Unblock the Notifications