ఒబామాకు ‘ఏపీ బ్రాండ్ అంబాసిడర్’ పూనమ్ కౌర్ ప్రత్యేక కానుక
హైదరాబాద్: టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ శుక్రవారం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిశారు. భారత్ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రత్యేక కానుక
ఈ సందర్భంగా పూనమ్.. బరాక్ ఒబామాను కలిసి చేనేత వస్త్రాలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను పూనమ్ తన ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో పోస్ట్ చేశారు.

ఉత్తమమైన ఘట్టం.. ఎంతో సంతోషం
తన జీవితంలో ఇది ఉత్తమ ఘట్టమని పూనమ్ పేర్కొన్నారు. తాను ఆదర్శంగా భావించే వ్యక్తి బరాక్ ఒబామా అని.. ఆయనకు చేనేత వస్త్రాలు కానుకగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. వీటిని ఆయన సతీమణి మిషెల్ కోసం ఇచ్చినట్లు చెప్పారు.

ఏపీకి బ్రాండ్ అంబాసిడర్
కాగా, ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రచారకర్తగా నటి పూనమ్ కౌర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణకు సమంత
ఈ నేపథ్యంలో మాజీ మిస్ ఆంధ్రా అయిన పూనమ్ కౌర్.. ఒబామాకు చేనేత వస్త్రాలు ఏపీ తరపున కానుకగా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి సమంత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications