విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ మంత్రుల రాజీనామాస్త్రం వెనుక ? అసలు కారణం చెప్పేసిన ధర్మాన- రెస్పాన్స్ ప్లీజ్ !

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం కోరుకుంటున్న మూడు రాజధానుల్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్న నేపథ్యంలో.. రాజకీయంగా దీన్ని నెగ్గించుకునేందుకు జగన్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నాన్-పొలిటికల్ జేఏసీ సాయంతో విశాఖ గర్జన నిర్వహించిన వైసీపీ దాంతో ఉత్తరాంధ్రలో మూడు రాజధానుల వ్యవహారం కాకరేపుతుందని భావించారు. అయితే ఆ స్ధాయిలో క్షేత్రస్ధాయిలో స్పందన లభించడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో మంత్రులు కూడా రూటుమార్చారు.

 ఉత్తరాంధ్రలో రాజధానుల పోరు

ఉత్తరాంధ్రలో రాజధానుల పోరు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల్లో భాగంగా విశాఖకు కార్యనిర్వాహక రాజధాని అంటే అసలు రాజధాని రావాల్సి ఉంది. దీనికోసం మూడేళ్లుగా వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్న వైసీపీ సర్కార్ పంతం నెగ్గించుకోవడంలో విఫలమవుతోంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో నమ్మకం సడలిపోతోంది. అదే సమయంలో విశాఖలో వైసీపీ నేతల కబ్జాలు, బెదిరింపులు ఇప్పుడు రాజధానుల వ్యవహారాన్ని పూర్తిగా పట్టాలు తప్పేలా చేస్తున్నాయి. తాజాగా విశాఖలో నాన్-పొలిటికల్ జేఏసీతో వికేంద్రీకరణ గర్జన చేయించిన వైసీపీ.. దాన్ని సొమ్ము చేసుకోవడంలో విఫలమైనట్లు తెలుస్తోంది.

ఫలించని విశాఖ గర్జన ?

ఫలించని విశాఖ గర్జన ?

విశాఖలో నాన్-పొలిటికల్ జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జనకు భారీ ఎత్తున వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, ఇతర ప్రాంతాల మంత్రులు, మాజీ మంత్రులు కూడా తరలివచ్చారు. భారీవర్షాన్ని సైతం లెక్కచేయకుండా గర్జనలో ర్యాలీగా నడిచివెళ్లారు. దీంతో మూడు రాజధానులకు భారీగా స్పందన లభించినట్లు వైసీపీ చెప్పుకుంది. కానీ వాస్తవంలో జరిగింది వేరు. విశాఖ గర్జనతో ఉత్తరాంధ్రలో రాజధానుల పోరును పతాకస్ధాయికి తీసుకెళ్లాలనిభావించిన వైసీపీకి క్షేత్రస్ధాయిలో ఎదురుదెబ్బ తగిలింది. దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి.

 ఉత్తరాంధ్రలో ఆశించిన స్పందన కరవు ?

ఉత్తరాంధ్రలో ఆశించిన స్పందన కరవు ?

విశాఖ గర్జన తర్వాత ఉత్తరాంధ్రలో జనం రోడ్లపైకి వస్తారని, ఆందోళనలు ఉధృతం చేస్తారని వైసీపీ భావించింది. ముఖ్యంగా విశాఖకు రాజధాని వస్తే ప్రయోజనం పొందే వర్గాలన్నీ ఒకటే తమ పోరుకు మద్దతిస్తారని భావించింది. కానీ అలా జరగలేదు. విశాఖలో రాజధాని రాక వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లభిస్తుందన్న దానిపై ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అవగాహన రాలేదు. ముఖ్యంగా వెనుకబడిన ఈ జిల్లాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా రాజధాని కోసం ఉద్యమం చేసేందుకు జనం ముందుకు రావడం లేదు.

ఉత్తరాంధ్రపై ధర్మాన అసంతృప్తి

ఉత్తరాంధ్రపై ధర్మాన అసంతృప్తి


విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో మంత్రి ధర్మాన ఉత్తరాంధ్ర జనంపై తన అసంతృప్తి వెళ్లగక్కారు. విశాఖను రాజధాన్ని చేయాలని ఉత్తరాంధ్ర జనం ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వాసులు ఎందుకు నోరు విప్పడం లేదని, ఎందుకు అంత కష్టంగా ఉందని మంత్రిగారు అడిగారు. జగన్ కు జై కొట్టేందుకు వచ్చిన ఇబ్బందేంటని ధర్మాన ప్రశ్నించారు. ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందని మీకు అనిపిస్తే చెప్పండని, సరిదిద్దుకుంటామని ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. కానీ తమ ప్రయత్నానికి మద్దతివ్వాలని కోరారు.

మంత్రుల రాజీనామాస్త్రం వెనుక ?

మంత్రుల రాజీనామాస్త్రం వెనుక ?

ఉత్తరాంధ్రలో మూడు రాజధానులకు లభిస్తున్న పేలవ స్పందన మంత్రుల్ని సైతం నిశ్చేష్టుల్ని చేస్తోంది. అమరావతికి మద్దతిస్తారా లేదా అన్నది పక్కనబెడితే.. మూడు రాజధానుల పేరుతో ఉద్యమాలు చేసేందుకు ఉత్తరాంధ్ర జనం సిద్ధంగా లేరనే విషయం క్షేత్రస్ధాయిలో స్పష్టమవుతోంది. దీంతో జనంలో ఉద్యమ వేడి రగిల్చేందుకు మంత్రులు రాజీనామాస్త్రం సంధిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సీనియర్ మంత్రిగా ఉన్న ధర్మాన పిలుపుకే స్పందన రాకపోవడంతో రాజీనామా లేదా పాదయాత్ర చేపడతామనే లీకులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సొంత ప్రభుత్వంలో రాజీనామాలతో ప్రయోజనం ఉంటుందా లేదా అనే అనుమానం వీరిని వేధిస్తోంది. అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరిగా రాజీనామాలు ప్రయోగించాలనే వాదన వైసీపీలో వినిపిస్తోంది.

English summary
poor response for three capitals in northern andhra may be the reason for ysrcp ministers leaks on resignations call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X