పవన్ కల్యాణ్‌పై ప్రముఖ ట్రాన్స్ జెండర్ పోటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారాయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ విసృతంగా పర్యటించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కల్యాణ్.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తన స్నేహితులతో ఇక్కడ కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిని కట్టిస్తానని నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఐదు రోజుల పాటు పిఠాపురంలోనే మకాం వేసిన పవన్ కల్యాణ్ తన గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి నేతలతో చర్చించారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్‌పై అధికార పార్టీ నుంచి వంగా గీత పోటీ చేస్తోన్న సంగతి అందరికి తెలిసిందే.

తాజాగా ఆయనపై ఓ ట్రాన్స్‌జెండర్ పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్‌పై ప్రముఖ టాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేయనున్నారు.గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్‌పై తమన్నా సింహాద్రి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు పవన్ కల్యాణ్‌పై పోటీ చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. భారత చైతన్య యువజన పార్టీ నుంచి తమన్నా సింహాద్రి బరిలో దిగనున్నారు. ట్రాన్స్‌జెండార్లకు చట్ట సభల్లో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తమన్నా సింహాద్రి తెలిపారు.
పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన తమన్నా సింహాద్రి..గత ఎన్నికల్లోనే జనసేన నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే కనీసం ఆయన్ను కలిసే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో ..ఇప్పుడు ఏకంగా తన అభిమాన హీరోపైనే పోటీకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే తమన్నా సింహాద్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. తెలుగు రియాల్టి షో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తమన్నా సింహాద్రి..ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై పోటీ చేయనుండటంతో తమన్నా సింహాద్రి పాపులారిటీ మరింత పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications