నారా బ్రాహ్మణికి పోసాని నాలుగు ప్రశ్నలు.. సమాధానం చెప్తే కాళ్ళకు దణ్ణం!!
టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. టిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ ఎఫ్ డి సి చైర్మన్ పోసాని కృష్ణ మురళి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు చేసిందంతా ప్రజల కోసమే చేశారంటూ చెబుతున్నారని, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజల కోసమే అంటే ఎలా అంటూ చంద్రబాబును విమర్శించారు పోసాని కృష్ణమురళి. 23 మంది ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొన్నది ప్రజల కోసమేనా అంటూ పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు.
దేశంలో చంద్రబాబుకు ఉన్నన్ని స్టేలు ఎవరికి లేవని పేర్కొన్న పోసాని కృష్ణ మురళి చంద్రబాబు అవినీతిపరుడని మోడీనే చెప్పారని, పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారన్నారు. అవినీతి పనులు చేస్తే ఎవరినైనా జైలులో పెడతారని, జైల్లో ఉన్నప్పుడు ఒక ఏడాదో, ఏడాదిన్నరో ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంటూ పేర్కొన్న ఆయన, జైల్లో ఉండి కూడా ధర్నాలు, ఆందోళనలు దేనికి చంద్రబాబు అంటూ ప్రశ్నించారు.

మోడీని పర్సనల్ గా చంద్రబాబు టార్గెట్ చేశారని, ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులు ఒప్పుకోవాలని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబుకు ఏసీ లేదని తెగ బాధగా ఉందని పేర్కొని చంద్రబాబును దోమలు కుడితే దోమల మందు, ఏసీ తాను కొనిస్తానని ఇచ్చి రమ్మంటూ పోసాని టిడిపి నేతలను ఎద్దేవా చేశారు.
తాజాగా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలపై మండిపడిన ఆయన బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలు నవ్వుకునేలా ఉన్నాయన్నారు. బ్రాహ్మణి మాటలు వింటుంటే న్యాయమూర్తి మీద కూడా కేసులు పెట్టాలి ఏమో అని ఆయన ఎద్దేవా చేశారు . బ్రాహ్మణిని తాను నాలుగు ప్రశ్నలు అడుగుతానని పేర్కొన్న పోసాని కృష్ణ మురళి ఆమె వాటికి సమాధానం చెప్పాలని కోరారు.
మీ తాతయ్య ను వెన్నుపోటు పొడిచింది ఎవరు? మీ తాతయ్యని చెప్పుతో కొట్టింది ఎవరు? మీ తాతయ్య ను చంపింది ఎవరు? జగన్ దగ్గర నుండి 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారు? అంటూ పోసాని కృష్ణమురళి నాలుగు ప్రశ్నలను నారా బ్రాహ్మణి కి సంధించారు. ఈ ప్రశ్నలకు ఆమె సమాధానం చెబితే బ్రాహ్మణి కాళ్లకు దండం పెడతాను అంటూ పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications