బాబు 'నిధి' ప్లాన్: నారా లోకేష్‌కు తెలంగాణ బాధ్యత?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన చేతుల నుంచి పార్టీ చేజారిపోకుండా రాజకీయ వారసుడిని సిద్ధం చేస్తున్నారు. కుమారుడు నారా లోకేష్‌ను తెలుగుదేశం కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధి సమన్వయ కర్తగా చంద్రబాబు నియమించారు.

పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ వివివి చౌదరి ఈ విషయాన్ని పాత్రికేయులకు వెల్లడించారు. సంక్షేమ నిధికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి నారా లోకేష్ సమన్వయకర్తగా ఉంటారన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలను సంప్రదించి సంక్షేమ నిధికి సంబంధించిన విధివిధానాలను రూపొందించి పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని చంద్రబాబు లోకేష్‌ను ఆదేశించారని చౌదరి చెప్పారు.

 Post to Nara Lokesh in Telugudesam

లోకేష్ నియామకం జరిగిన కొద్ది సేపటికే గుంటూరుకు చెందిన కొండా లక్ష్మీనారాయణ లక్ష రూపాయిల చెక్కును తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధికి అందించారు. ఒహియో రాష్ట్ర తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కేశాని శ్రీధర్ కూడా లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. కొద్దిరోజులు సంక్షేమ నిధి సమన్వయకర్తగా లోకేష్‌ను కొనసాగించి అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

రానున్న రోజుల్లో తాను పూర్తిస్థాయి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై దృష్టి పెడుతూ లోకేష్‌కు తెలంగాణ వ్యవహారాలు అప్పగించాలని చూస్తున్నార'. బాలకృష్ణ కుమార్తె తెలంగాణలో జన్మించడం, లోకేష్ కూడా తాను తెలంగాణవాదినేనని ఇటీవల నేతల ముందు చెప్పడంతో తెలంగాణ వ్యవహారాలపై గట్టి పట్టుసాధించవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+