మొన్న టీడీపీ, నిన్న వైసీపీ, నేడు బీజేపీ..ఇంకెన్ని పార్టీలు మారతావ్ తల్లి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సినిమాల రిలీజ్‌ల కంటే పార్టీల మారే సెలబ్రిటీల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. తాజాగా ఈ లిస్టులోకి పోతుల సునీత పేరు చేరింది. ఏకంగా ఏడాది కాలం పాటు తెర వెనుక ఉన్న ఆమె, ఇప్పుడు బీజేపీ అనే కొత్త బ్యానర్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

ఒక్కో సినిమాకు ఒక్కో హీరోను మార్చినట్టు, ఒక దాని తర్వాత ఒకటిగా పార్టీలను మార్చడం సునీత గారి స్పెషాలిటీ అనిపిస్తోంది. ఆమె రాజకీయ ప్రస్థానం చూస్తే ఒక ట్రిపుల్ యాక్షన్ డ్రామాలా ఉంది. మొదట తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టి, అక్కడి నుంచి ఎమ్మెల్సీ పదవి సంపాదించారు. ఆ తర్వాత, టీడీపీకి గుడ్ బై చెప్పి అప్పటి అధికార పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా ఎమ్మెల్సీగా కొనసాగారు.

Pothula Sunitha Joins BJP After TDP and YSRCP

ఇక ఇప్పుడు, రెండు ప్రాంతీయ పార్టీలలో పనిచేసిన అనుభవం సరిపోలేదన్నట్టు, ఆమె ఏకంగా జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరబోతున్నారు. ఇది ఆమె కెరీర్‌లో మూడో పార్టీ. నిజంగా ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. సునీత గారి చేరికతో ఏపీలో బీజేపీ ఎంత బలపడుతుందో అనేది పక్కన పెడితే, ఆమె భవిష్యత్తులో ఇంకెన్ని పార్టీలు మారుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, ఒక పార్టీలో స్థిరంగా ఉండకుండా, ఇలా పార్టీలు మారుతున్నా ఆమెకు మంచి ఆదరణ దక్కడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+