వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్‌కు కేంద్రం నుంచి శుభవార్త - మరో వరం అందినట్టే..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం వద్ద తనకు ఉన్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేయించుకుంటోన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తరహాలో కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వైఖరికీ వెళ్లట్లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి సంపూర్ణ మద్దతు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం లౌక్యంగా వ్యవహరిస్తోన్నారు.

చంద్రబాబు పాదం మోపిన ప్రదేశం - కరవు కాటకాలమయం- అందుకే..!!చంద్రబాబు పాదం మోపిన ప్రదేశం - కరవు కాటకాలమయం- అందుకే..!!

 పోలవరం సహా..

పోలవరం సహా..

రాష్ట్రానికి వరప్రదాయినిగా చెప్పుకొంటోన్న పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం నుంచి నిధులను సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నారాయన. నిధుల మంజూరు విషయంలో ఏర్పడిన అడ్డంకులను అధగమిస్తోన్నారు. జాతీయ ప్రాజెక్ట్ కావడం వల్ల పోలవరం నిర్మాణానికి వ్యయం చేసిన వేల కోట్ల రూపాయల మేర నిధులు కేంద్రం నుంచి తెప్పించుకుంటోన్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు వైఎస్ జగన్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ను కలిశారు.

 మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు..

మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు..

ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో శుభవార్త అందింది. మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి అంగీకరించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసింది. మొత్తంగా 3,940 కోట్ల రూపాయల మేర రుణాన్ని మంజూరు చేసింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ మొత్తాన్నంతటినీ మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి వ్యయం చేయాల్సి ఉంటుంది.

 మళ్లీ అదే జిల్లాలో..

మళ్లీ అదే జిల్లాలో..

మచిలీపట్నం ఓడరేవు నిర్మాణాన్ని వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందట కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన బహిరంగ సభలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారాయన. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. త్వరలోనే మరోసారి ఇదే జిల్లాలో అడుగు పెడతానని హామీ ఇచ్చారు. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తాననీ ప్రక

కార్యరూపంలో..

కార్యరూపంలో..

ఇప్పుడది వాస్తవ రూపాన్ని దాల్చబోతోంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం మంజూరైన నేపథ్యంలో ఇక జగన్ ప్రభుత్వం ఏ మాత్రం జాప్యం చేయదలచుకోనట్టే. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో నిర్మాణ పనులకు శిలాఫలకం పడొచ్చనే అంచనాలు అధికార వర్గాల్లో వ్యక్తమౌతోన్నాయి. హైకోర్టు సైతం ఈ పోర్ట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.

 రోడ్- రైల్ కనెక్టివిటీ..

రోడ్- రైల్ కనెక్టివిటీ..

పోర్ట్ నిర్మాణానికి అవసరమైన రోడ్ కనెక్టివిటీని కల్పించే దిశగా రోడ్లు-భవనాల మంత్రిత్వ శాఖ అధికారులు అప్పుడే ప్రతిపాదనలను సైతం సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. రైలు, రోడ్ కనెక్టివిటీ కోసం ఎంత భూమిని సేకరించాలనే విషయం మీద ఇదివరకే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ అయినట్లు చెబుతున్నారు. ఎంత మేర భూమిని సమీకరించాల్సి ఉంటుందనే విషయం మీద జిల్లా అధికారులు కసరత్తు చేపట్టారు.

English summary
The Power Finance Corporation given Rs 3,940 Crore loan to the AP government to built Machilipatnam port.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X