శ్రీశైలంలో కుడి,ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత; కారణం ఇదే!!

శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశాయి. శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని తెలుగురాష్ట్రాల తీరుపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సీరియస్ అయిన విషయం తెలిసిందే .

కృష్ణా బోర్డు సీరియస్.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

కృష్ణా బోర్డు సీరియస్.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని చేయడాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తప్పుబట్టింది. వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు.శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 803.60 అడుగులకు చేరుకుంది.

 నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గానూ ప్రస్తుత నీటి నిల్వ 30 టీఎంసీలే

నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గానూ ప్రస్తుత నీటి నిల్వ 30 టీఎంసీలే

అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గానూ ప్రస్తుత నీటి నిల్వ 30 టీఎంసీలకు చేరుకుంది. దీంతో వచ్చే ఎండాకాలంలో తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని గతేడాది కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివెయ్యాలని ఆదేశించింది. అయినా అదేమీ పట్టించుకోకుండా విద్యుత్ ఉత్పత్తి చెయ్యటంతో ఇటీవల మరోమారు కృష్ణా బోర్డు సీరియస్ అయ్యింది. తక్షణం విద్యుత్ ఉత్పత్తి నిలిపివెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కుడి, ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు.

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు విద్యుత్‌ ఉత్పత్తి.. దారుణంగా పడిపోయిన నీటి నిల్వలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు విద్యుత్‌ ఉత్పత్తి.. దారుణంగా పడిపోయిన నీటి నిల్వలు

శ్రీశైలం రిజర్వాయర్‌లో కృష్ణా నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించుకోవడం వల్ల డిసెంబర్‌ 25 నుంచి నీరు వేగంగా తగ్గిపోవడంతో ప్రస్తుత నీటిమట్టం 30 టీఎంసీలకు పడిపోయింది. డిసెంబరు 25న 863.30 అడుగుల వద్ద ఉన్న మట్టం ప్రస్తుత 803.60 అడుగులకు చేరింది. మొత్తం స్టోరేజీ గతేడాది 113.22 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 30 టీఎంసీలుగా ఉంది.

 ఎడా పెడా విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడేసిన తెలుగు రాష్ట్రాలు

ఎడా పెడా విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడేసిన తెలుగు రాష్ట్రాలు

నియమం ప్రకారం, 834 అడుగుల కంటే తక్కువ విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఉపయోగించకూడదు. కానీ ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తికి ఎడాపెడా నీటిని వినియోగించుకోవడం వల్ల శ్రీశైలం జలాశయాల్లో నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయి . 800 అడుగుల దిగువ స్థాయి నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే కృష్ణా రివర్ బోర్డు అనుమతించింది. తాగునీటికి, సాగునీటికి ఈసారి ఇబ్బంది ఎదురవుతుందన్న భావన శ్రీశైలం జలాశయంలో తాజా నీటి నిల్వతో అర్ధం అవుతుంది. రెండు రాష్ట్రాలు ప్రధాన ప్రయోజనాలకు తూట్లు పొడిచి విద్యుత్ ను ఉత్పత్తి చేశాయి,

రాష్ట్రంలోని ఇతర రిజర్వాయర్ లలో నీటి నిల్వల పరిస్థితి ఇలా

రాష్ట్రంలోని ఇతర రిజర్వాయర్ లలో నీటి నిల్వల పరిస్థితి ఇలా

రాష్ట్రంలోని ఇతర రిజర్వాయర్లలో నీటి మట్టాలు సంవత్సరానికి సాధారణ స్థాయికి దగ్గరగా ఉన్నాయి. నాగార్జునసాగర్లో 273.82 టీఎంసీలు (గత ఏడాది 218.45), , పులిచింతలలో 39.12 టీఎంసీలు ( గత ఏడాది 31 టీఎంసీలు) ఉన్నాయి. తుంగభద్ర డ్యామ్‌లో గతేడాది 34.90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 52.0 టీఎంసీలు, గతేడాది 7.17 టీఎంసీలకుగాను జూరాల 9.66 టీఎంసీల నీరు ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+