రికార్డులను బద్దలు బద్దలు కొడుతున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’
ఎప్పుడెప్పుడా అంటూ వేయికళ్లతో ఎదురుచూసిన ప్రభాస్ 'ఆదిపురుష్' విడుదలైన తర్వత రికార్డులు బద్ధలు కొడుతూ ముందుకు దూసుకుపోతోంది. ఈ సినిమాపై మొదటి నుంచి అభిమానులతోపాటు సినీ ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ నెలకొంది. దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా ప్రభాస్ పేరు మార్మోగుతోంది. 'ఆదిపురుష్' తొలిరోజు కలెక్షన్లు చూసి సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. బాక్సీఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది.
హిందీలోనే తొలిరోజు రూ.50 కోట్లు వసూలు చేసింది. పఠాన్ సినిమా తర్వాత ఆదిపురుష్ ఎక్కువ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా ఇతర భాషల్లో కూడా రూ.50కోట్ల పైన వసూలు చేసింది. దేశవ్యాప్తంగా మొదటిరోజు రూ.120 కోట్ల నుంచి రూ.140 కోట్ల వరకు రాబట్టింది. తర్వాత రెండురోజులు వీకెండ్ కావడంతో భారీ వసూళ్లు ఖాయమనే నమ్మకంలో చిత్ర యూనిట్ ఉంది. అలాగే విదేశాల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది.

అడ్వాన్స్ బుకింగ్ లోనే గత రికార్డులు బద్ధలు కొట్టింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 'ఆదిపురుష్'కలెక్షన్లు మొదటిరోజు రూ.150 కోట్లు దాటతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 6200 స్క్రీన్లలో విడుదలైంది. హిందీలోనే 4,000 స్క్రీన్లలో విడుదలైంది. వీకెండ్‌లో రూ.250 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. కరోనా తర్వాత భారీ ఓపెనింగ్స్ సాధించుకున్న సినిమాల జాబితాలో ఆదిపురుష్ కూడా చేరింది. గతంలో నెలకొన్న ఎన్నో రికార్డులను ఈ సినిమా బద్ధలు కొడుతుందంటున్నారు. ప్రస్తుతానికి పఠాన్ తర్వాత రెండోస్థానంలో ఈ చిత్రం నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.115.5 కోట్లు వసూలు చేసింది. హిందీలో రూ.72కోట్లు, కర్ణాటకలో రూ.12.5 కోట్లు, వివిధ రాష్ట్రాల్లో రూ.4.5 కోట్ల వరకు వసూలు చేసిందని తెలుస్తోంది. . ఓవర్సీస్ కలెక్షన్లను కూడా కలుపుకొని ఈ సినిమా తొలిరోజు వసూళ్లు రూ.240 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications