YCPలో ఆయన TDP కోవర్ట్?

వైఎస్సార్‌సీపీలో అసంతృప్తి గళాలు పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నాయి

ఏపీలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీలో అసంతృప్తి గళాలు పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని మరో నియోజకవర్గంలో ధిక్కార స్వరం వినిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ ఇన్ ఛార్జ్‌పై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏకంగా టీడీపీకి కోవర్ట్ అంటూ ముద్ర వేసేశారు.

కొండెపి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి వరికూటి అశోక్‌బాబు సొంత పార్టీని నాశనం చేస్తున్నారని, అనుచరులతో కలిసి ఇసుక, మద్యం, బియ్యం అక్రమ వ్యాపారాలు చేయిస్తూ దోచుకుంటున్నారని అసమ్మతి నేతలు మండిపడ్డారు. అశోక్‌బాబు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కోవర్టుగా పని చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు విమర్శించారు. నిజమైన నేతల్ని, పార్టీ కార్యకర్తల్ని పక్కన పెట్టారని, తన సొంత మనుషులను ఏజెంట్లుగా పెట్టి అన్ని మండలాల్లో మాఫియా నడుపుతున్నారని వారంతా ఆరోపణలు చేశారు.

prakasam district kondep ysrcp dissident leaders fire on party incharge ashokbabu

బియ్యం, ఇసుక, మద్యం వ్యాపారాలు చేయిస్తూ మామూళ్లు దండుకుంటున్నారని, త్వరలోనే ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన్ను అధిష్ఠానం తప్పిస్తుందని అసమ్మతి నేతలు వెల్లడించారు. అలా జరగని పక్షంలో మార్చి నెలాఖరున నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి అశోక్‌బాబు బాధితులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు తాడేపల్లి వరకు పాదయాత్ర చేస్తారని, ఇన్ ఛార్జిని మార్చాలని ఒత్తిడి తెస్తారని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+