చంద్రబాబుతో భేటీపై ఒక్క ముక్కలో తేల్చేసిన ప్రశాంత్ కిశోర్: జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది?

Prashant Kishor: ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమిస్తోంది.

అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు సైతం పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో ఉంది ఈ రెండు పార్టీల పొత్తుల వ్యవహారం.

ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా అడుగుపెట్టారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఈ సాయంత్రం ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా విజయవాడకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Prashant Kishor

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించాలంటూ చంద్రబాబు, నారా లోకేష్ అభ్యర్థన మేరకు విజయవాడకు వచ్చారు. కరకట్ట నివాసంలో వారితో సమావేశం అయ్యారు. వారిద్దరి మధ్య సుమారు మూడు గంటలకు పైగా సాగింది. సమావేశం ముగిసిన అనంతరం బయటికి వచ్చిన ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబు నివాసం వద్ద విలేకరులతో మాట్లాడటానికి నిరాకరించారు.

ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే కారులో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద తనను కలిసిన విలేకరులతో క్లుప్తంగా మాట్లాడారు. చంద్రబాబును తాను మర్యాదపూరకంగా మాత్రమే కలిశానని, ఇందులో రాజకీయాల ప్రస్తావన రాలేదని అన్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు కావడం వల్ల పిలిచిన వెంటనే వచ్చానని, ఇది మర్యాదపూరక భేటీ మాత్రమేనని చెప్పారు.

Prashant Kishor

తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయడానికి ప్రశాంత్ కిశోర్ అంగీకరించలేదని చెబుతున్నారు. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సిన దశలో ఇప్పుడు తానేమీ చేయలేనని కుండబద్దలు కొట్టారని సమాచారం. జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందని, దీన్ని సరిదిద్దుకోవడానికి చాలినంత సమయం ఇప్పుడు లేదని ఆయన చంద్రబాబుకు తేల్చి చెప్పారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా చంద్రబాబు పెట్టిన కొన్ని ప్రపోజల్స్‌పై ప్రశాంత్ కిశోర్ విముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వైసీపీని ఎదుర్కొనడానికి అవసరమైన వ్యూహాలను అమలు చేయడానికి ఇప్పుడు సమయం లేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో సడలని విశ్వాసం నెలకొందని, దాన్ని చెరిపెయ్యడానికి సమయం సరిపోదని తేల్చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+