Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో ఆగని పీఆర్సీ రగడ: ఉద్యోగుల నిరసనలు, ప్రతిపక్షాల విమర్శలతో జగన్ సర్కార్ కు తలనొప్పి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల నిరసన పర్వం కొనసాగుతోంది. పీఆర్సి విషయంలో జగన్ సర్కారు విడుదల చేసిన జీవోపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తాడోపేడో తేల్చుకుంటామని ఉద్యోగ సంఘ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీల నేతలు జగన్ సర్కార్ ఉద్యోగులను మోసం చేస్తుందని తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.

 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మౌనదీక్ష

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మౌనదీక్ష

సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మౌనదీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు తమ నిరసనలు కొనసాగుతాయని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఇక మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ప్రభుత్వం ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పీఆర్సీలో విషయంలో జగన్ తో భేటీలో రాజీపడ్డ ఉద్యోగ సంఘాలను ఇటీవల వైసిపి ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సి జీవోలు తీవ్ర అసహనానికి గురి చేసాయి.

 నల్ల బ్యాడ్జీలతో సచివాలయంలో విధులకు హాజరైన సచివాలయ ఉద్యోగులు

నల్ల బ్యాడ్జీలతో సచివాలయంలో విధులకు హాజరైన సచివాలయ ఉద్యోగులు

ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు అన్యాయం చేసేలా విడుదల చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలంటూ సచివాలయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. ఏపీ సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో సచివాలయంలో విధులకు హాజరయ్యారు. పిఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీ విషయంలో జగన్ మోసంపై మండిపడిన అశోక్ బాబు

ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీ విషయంలో జగన్ మోసంపై మండిపడిన అశోక్ బాబు


నిన్నటికి నిన్న టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు జగన్ ఉద్యోగులను మోసం చేస్తున్నారని చరిత్రలో ఇటువంటి దారుణమైన పీఆర్సీని ఇప్పటివరకు చూడలేదని, ఇకముందు చూడబోమని పేర్కొన్నారు. 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చినపుడే ఉద్యోగులు వ్యతిరేకించాల్సింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండేళ్ల పదవీ విరమణ వయసు పెంచగానే ఉద్యోగ సంఘాల నాయకులు సంతోష పడ్డారని, కానీ ఇప్పుడు జరిగింది ఏమిటని ప్రశ్నించారు. 14 లక్షల ఉద్యోగుల జీత భత్యాల పై ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ అశోక్ బాబు వెల్లడించారు. ఉద్యోగ సంఘాల నాయకుల తీరుతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందన్న యనమల రామకృష్ణుడు

ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందన్న యనమల రామకృష్ణుడు

ఇక తాజాగా టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ఇవ్వడం చరిత్రలో జరగలేదని వెల్లడించిన ఆయన గతంలో అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు. ఉద్యోగుల పోరాటానికి టిడిపి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్న యనమల రామకృష్ణుడు, ఉద్యోగుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 ఉద్యోగులను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం తగదు: సీపీఐ నారాయణ

ఉద్యోగులను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం తగదు: సీపీఐ నారాయణ

ఇక మరోవైపు సిపిఐ నేత నారాయణ కూడా ఉద్యోగులను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరచాలి కానీ ఈ విధంగా చేయడం ఏమాత్రం న్యాయం కాదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఖమ్మం ఆసుపత్రిలో కెసిఆర్ ఉద్యమ విరమణకు ప్రయత్నం చేయగా తెలంగాణ ప్రజలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి ఉద్యమాన్ని కొనసాగించారని, ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్నది 2009 కేసీఆర్ దీక్ష తరహాలో ఉందని సిపిఐ నారాయణ పేర్కొన్నారు.

Recommended Video

    Covid-19 New Guidelines In AP, Issues Night Curfew | Oneindia Telugu
    ఉద్యోగులను సంతృప్తి పరిచేలా బెనిఫిట్స్ ను ఇవ్వాలి: నారాయణ

    ఉద్యోగులను సంతృప్తి పరిచేలా బెనిఫిట్స్ ను ఇవ్వాలి: నారాయణ

    నేడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా తిరగబడిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. ఎన్జీవో నాయకత్వంలో ఉద్యోగుల తిరుగుబాటు తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుందని సిపిఐ నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ మరోవైపు ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ ను తగ్గిస్తామని చెబితే ఉద్యోగులు తిరగబడక ఏం చేస్తారు అంటూ సీపీఐ నారాయణ ప్రశ్నించారు. ఉద్యోగులు తమకు వచ్చే బెనిఫిట్స్ ను ఎప్పటికీ వదులుకోరు అని నారాయణ పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలను ఒప్పించి జగన్ ప్రభుత్వం వారిని సంతృప్తి పరచలేకపోయిందని సిపిఐ నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులను సంతృప్తి పరిచేలా బెనిఫిట్స్ ను అందించాలని సిపిఐ నారాయణ గుర్తు చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+