వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ముందస్తు సంకేతాలు-జనంలోనే జగన్, చంద్రబాబు-కేంద్రం కోర్టులో బంతి ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముందుగా సీఎం జగన్ కేబినెట్ ప్రక్షాళనతో రాజకీయ వేడి పుట్టించగా.. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్ని నిజం చేసేలా వైసీపీ నేత సజ్జల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీ అధినేతలు జగన్, చంద్రబాబు జనంలోకి వెళ్లిపోవడం చూస్తుంటే ముందస్తు ఎన్నికలు తప్పేలా లేవు.

ఏపీలో ముందస్తు రాగాలు

ఏపీలో ముందస్తు రాగాలు


ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు మరో రెండేళ్ల సమయం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయి. అయితే ఆలోపే ఎన్నికల వేడి రగిల్చేలా రాజకీయ పార్టీలు చేస్తున్న హంగామా ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇస్తోంది. లేకపోతే ఇంత ముందుగా ఎన్నికల దిశగా వైసీపీ, టీడీపీ కానీ, వాటి అధినేతలైన జగన్, చంద్రబాబు కానీ దూకుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు. దీంతో ముందస్తు ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ఉన్న అడ్డంకులు ఏంటన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది.

ప్రజల్లోనే జగన్, చంద్రబాబు

ప్రజల్లోనే జగన్, చంద్రబాబు

సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా ఎన్నికలకు రెండేళ్ల ముందు ఏ పార్టీ అధినేత అయినా జనంలోకి వెళ్లాలనుకోరు. ఎన్నికలకు ఏడాది ముందు జనంలోకి వెళ్లి ఓట్లు అడగాలని భావిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం విధిస్తున్న ఛార్జీల భారాన్ని నిరసిస్తూ బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. అలాగే జగన్ కూడా దాదాపు ప్రతీ రోజూ జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. పార్టీ నేతలందరికీ గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం అప్పగించారు. తానూ త్వరలో నేరుగా రంగంలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కేంద్రం అంగీకరిస్తే ముందస్తేనా ?

కేంద్రం అంగీకరిస్తే ముందస్తేనా ?

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిపేందుకు వైసీపీ సర్కార్ సిద్దంగానే ఉన్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఏడాది, రెండేళ్లలో ఎన్నికలు ఉంటాయని సజ్జల ఇప్పటికే చెప్పారు. అలాగే ముందస్తుకు పార్టీ శ్రేణుల్ని చంద్రబాబు ఇప్పటికే సంసిద్ధం చేస్తున్నారు. జగన్ సంకేతాలతో చంద్రబాబు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వ్యూహాలు మార్చుకుంటున్నారు. దీంతో ముందస్తుకు ఇరువురు నేతలు సంసిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఇందుకు కేంద్రం ఒప్పుకుంటుందా లేదా అనేది ఇక్కడ తేలాల్సిన అంశం. అయితే ప్రస్తుతం కేంద్రంతో జగన్ లాబీయింగ్ నేపథ్యంలో కేంద్రం ముందస్తుకు అంగీకరించే అవకాశాలూ లేకపోలేదు.

English summary
pre-poll rumours looms in andhraprdesh with cm ys jagan and opposition leader chandrababu's continue tours into public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X