తిరుమలలో కీలక ఘట్టం- ప్రిపేర్ అయిన టీటీడీ
తిరుమలలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. స్వామివారి రోజుకో వాహనసేవపై అశేష భక్తజనాన్ని కరుణిస్తోన్నారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో వేలాదిమంది భక్తులు కనులారా ఉత్సవాలను దర్శించుకుంటోన్నారు. ప్రత్యేక పూజలు చేస్తోన్నారు. స్వామివారి వాహన సేవకు ముందు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోన్నాయి.
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత ఘట్టం.. గరుడసేవ. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులకు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. టీటీడీ జేఈవో వీ వీరబ్రహ్మం, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శనివారం సాయంత్రం ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో సమన్వయ సమావేశం ఏర్పాటైంది.

తిరుమల నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తుల సౌకర్యార్థం ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేశామని, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు సమన్వయం చేసుకుని గ్యాలరీలు, ఔట్ సైడ్ క్యూలైన్లు, వీక్యూసీ -2 క్యూలైన్లు, బయటి ప్రాంతాల్లో ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు తదితరాలు అందేలా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వాటిని పంపిణీ చేయాలని సూచించారు.
ప్రత్యేక విధుల్లో భాగంగా తిరుమలలో సేవలు అందించడానికి వచ్చిన ప్రతి ఉద్యోగి తమకు కేటాయించిన విధులను బాధ్యాతాయుతంగా నిర్వర్తించాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్నప్రసాదాలు, మంచినీటి కొరత, ఆరోగ్య సమస్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటివి తలెత్తితే తక్షణమే పరిష్కరించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సీవీఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ, వాహన సేవలు పూర్తయిన వెంటనే ఎలాంటి అవాంతరాలు లేకుండా భక్తులు బయటికి వెళ్లేలా ప్రతి వీధికి ఒక అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను తరలించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులు కమాండ్ కంట్రోల్‌ను సంప్రదించి సమస్యను తెలియజేయాలని కోరారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ, గ్యాలరీలు, నాలుగు మాడ వీధుల్లో హారతి పాయింట్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్యాలరీలలోని ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు అందేలా ఉద్యోగులు, పోలీసులు, శ్రీవారి సేవకులు సమన్వయంతో సేవలు అందించాలన్నారు.
-
ఈ నెల 30 నుంచి తిరుమలలో -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications