ఆయనకు సీటిస్తే 'పసుపు జెండా'?.. లేదంటే 'ఫ్యాన్ గాలి'!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 28వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లబోతున్నారు. జిల్లాలో ముఖ్యంగా దర్శి నియోజకవర్గంపై ఆయన దృష్టిసారించారు. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన శిద్ధా రాఘవరావు మంత్రి పదవిని చేపట్టారు. 2019లో కదిరి బాబూరావుకు టికెట్ ఇవ్వగా ఆయన ఓడిపోవడంతో పమిడి రమేష్ కు ఇన్ ఛార్జి గా బాధ్యతలు అప్పగించారు. తర్వాత ఆయన కూడా పదవికి రాజీనామా చేశారు.

జులైలో పదవి నుంచి తప్పుకున్న రమేష్

జులైలో పదవి నుంచి తప్పుకున్న రమేష్

ఈ ఏడాది జులై 19న దర్శి నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి పమిడి రమేష్ తప్పుకున్నారు. దర్శిలో టీడీపీ కోసం నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని పనిచేశానని, రాబోయే రోజుల్లో ఇతర నేతలతోపాటు తాను కూడా పార్టీ విజయాన్నే కోరుకుంటున్నానంటూ వీడియో విడుదల చేశారు. తనకు ఇన్ ఛార్జిగా పదవినిచ్చిన చంద్రబాబుకు, సహకరించిన పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పమిడి రమేష్ పార్టీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

నియోజకవర్గంలో పార్టీ జెండా కోసమే..

నియోజకవర్గంలో పార్టీ జెండా కోసమే..

పార్టీ మహానాడు నిర్వహించిన తర్వాత కొన్ని పరిణామాలు జరిగాయని, దర్శి నియోజకవర్గంలో పోటీచేసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారన్నారు. అధిష్టానం పిలవకపోయినప్పటికీ వాటిని నేనే చెబుదామని వెళ్లానని, కానీ ఇంతకాలం తాను చేసిన పనికి, నామీద వారికున్న అభిప్రాయానికి ఎలాంటి పొంతన లేదని అర్థమైందన్నారు. తాను వీటిపై విమర్శించనని, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తామందరి లక్ష్యమన్నారు. దర్శి నియోజకవర్గంలో టీడీపీ జెండాను రెపరెపలాడించడమే అందరి ఆశయంగా మారిందన్నారు.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇన్ ఛార్జి నియామకం?

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇన్ ఛార్జి నియామకం?

రమేష్ తర్వాత ఇన్ చార్జిగా బాధ్యతలు ఎవరూ తీసుకోలేదు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో దర్శికి కొత్త ఇన్ ఛార్జి రావచ్చంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దర్శిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం రమేష్ బాబుకే బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు. రమేష్ ఇన్ ఛార్జిగా ఉన్న సమయంలోనే దర్శి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని, పార్టీ కోసం నిరంతరం పనిచేసే మనిషి అంటున్నారు. మరోవైపు పమిడి కూడా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తానని బాబు హామీ ఇస్తే తీసుకుంటానని ఆయన అంటున్నారు. ఒకవేళ రమేష్ కు హామీ ఇస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా దర్శిలో పసుపు జెండా ఎగరడం ఖాయమని, లేదంటే ఫ్యాన్ గాలి వీస్తుందనే అభిప్రాయం నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+