అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీ మాధవ్‌ ఘటనపై స్పందించిన రాష్ట్రపతి - చర్యలు తీసుకోవాలంటూ..!!

|
Google Oneindia TeluguNews

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటన పైన రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఇప్పటికే ఇది ఒర్జినల్ వీడియో కాదంటూ అనంతపురం జిల్లా పోలీసులు స్పష్టత ఇచ్చారు. తొలుత ఈ వీడియో విదేశాల నుంచి టీడీపీ సైట్ లో అప్ లోడ్ అయిందని చెప్పుకొచ్చారు. రాజకీయంగా ప్రకంపనాలకు కారణమైన ఈ వీడియో వ్యవహారం పైన ఏపీలోని డిగ్నిటీ ఫర్‌ ఉమెన్‌ ఐక్య కార్యాచరణ సమితి నేతలు రాష్ట్రపతిని కలిసారు.

స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌, పలువురు కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశారు.మాధవ్ వ్యవహారం పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఫిర్యాదు పైన స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం తగిని చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. స్పందించింది. ఈ నెల 23న మహిళా జేఏసీ నేతలంతా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారని.. ఆ కాపీని సీఎస్‌కు పంపి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిపింది.

సమాచారం ఇస్తూ లేఖ

సమాచారం ఇస్తూ లేఖ


ఈ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్‌ చెన్నుపాటి కీర్తికి సమాచారం ఇస్తూ లేఖ పంపింది. అఖిలపక్షాల మహిళా ఐకాస నేతలు గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ ను కూడా కలిసి ఒక నివేదిక సమర్పించారు. కేంద్ర ఫోరెన్సిక్​కి ఎంపీ వీడియో వ్యవహారం అప్పగించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు మహిళల పట్ల ఎలా ఉండాలనే దానిపై శిక్షణ తరగతులు ఉండాలని సూచించారు. ఇదే వ్యవహారం పైన రాష్ట్ర మహిళా కమిషన్ డీజీపీకి లేఖ రాసింది. విచారణ జరిపి ఎంపీ గోరంట్లపై చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సూచించారు.

కలకలం రేపిన వీడియో వ్యవహారం

కలకలం రేపిన వీడియో వ్యవహారం


మహిళాలోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆమె డీజీపీని కోరారు. ఈ వీడియో పైన రాకీయంగానూ అధికార - ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతపురం ఎస్పీ ఆగస్టు 3వ తేదీ రాత్రి తొలుత ఈ వీడియో అప్ లోడ్ అయినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఇది షేర్ అయింది. దీని పైన గోరంట్ల మాధవ్ అప్పుడే స్పందించారు. తన యోను మార్ఫింగ్‌ చేశారని చెప్పారు. ఇప్పుడు, రాష్ట్రపతి కార్యాలయం స్పందనతో ఈ అంశం పైన మరోసారి చర్చ మొదలైంది.

English summary
President Office Respond on MP Gorantla Video Viral Issue, Ask AP Chief Secretary to take action on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X