ఏపీకి రాష్ట్రపతి: రాత్రికి రాత్రే ఎలా, మంత్రులు-ఎమ్మెల్యేలకు చేదు, నాకే చెప్పలేదని ఎమ్మెల్యే

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం అమరావతిలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి పదిన్నరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకొని, ఇండియన్ ఎకనామిక్స్ అసోసియేషన్ శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

ఏపీలో రాష్ట్రపతి.. ప్రతిష్ఠాత్మక ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్ ప్రారంభం | Oneinda Telugu

చదవండి: ఏపీకి సవితా కోవింద్, పర్యటన ముగిసే వరకు ఆమె వెంటే అఖిలప్రియ

ఆ తర్వాత పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏపీ సచివాలయంలో ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాలకు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

చదవండి: ఒక కనెక్షన్.. మూడు సేవలు! ఏపీలో బృహత్తర ప్రాజెక్టు.. రేపు జాతికి అంకితం!

 ఆహ్వానం అందలేదని అధికారులపై ఆగ్రహం

ఆహ్వానం అందలేదని అధికారులపై ఆగ్రహం

ఇదిలా ఉండగా, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తమకు ఆహ్వానం లేకపోవడంపై అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి కార్యక్రమాలకు ఆహ్వానం అందలేదని వారు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ముందుగానే ఆహ్వానం అందలేదని చెబుతున్నారు.

చివరి నిమిషంలో చెబుతారా, రాత్రికి రాత్రి ఎలా రావాలి

చివరి నిమిషంలో చెబుతారా, రాత్రికి రాత్రి ఎలా రావాలి

ఫైబర్ గ్రిడ్ కార్యక్రమానికి రావాలని చివరి నిమిషంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పారు. కొందరికి ఫోన్లో సమాచారం అందించారు. హఠాత్తుగా చెప్పడం ఏమిటని ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము రాత్రికి రాత్రి ఎలా రావాలని మండిపడ్డారు.

నా నియోజకవర్గంలో కార్యక్రమం, నాకే చెప్పలేదు

నా నియోజకవర్గంలో కార్యక్రమం, నాకే చెప్పలేదు

ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం తన నియోజకవర్గంలో జరుగుతోందని ఎమ్మెల్యే శ్రవణ్ అన్నారు. తన నియోజకవర్గంలోని కార్యక్రమానికి తనకే ఆహ్వానం అందలేదని వాపోయారు. ఇప్పుడు చెబితే ఈ రాత్రి ఎలా వస్తామని మంత్రి అచ్చెన్నాయడు, విప్ కూన రవి, మరికొందరు ఎమ్మెల్యేలు అధికారులపై ఆగ్రహించారు.

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు

రాష్ట్రాన్నిడిజిటల్ ఏపీగా తీర్చిదిద్దే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు ఒక్క కనెక్షన్‌తో మూడు సేవలు లభించనున్నాయి. ఈ కనెక్షన్‌తో అత్యంత చౌక ధరకే ప్రతి కుటుంబం ఇంటర్నెట్, టెలిఫోన్, 250 వరకు టీవీ చానళ్లను పొందవచ్చు. అపరిమిత కాలింగ్ సదుపాయం, వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ కూడా ఉంటాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Ram Nath Kovind Andhra Pradesh tour to inaugurates development works.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి