పార్లమెంటులో చెడుగుడే: లగడపాటి, పార్టీ లేదు: గంటా

విజయవాడ: శాసనసభ తిరస్కరించిన తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఆమోదించరనే నమ్మకముందని విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ రబ్బర్ స్టాంప్ కాదని ఆయన అన్నారు. శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. విభజనను అడ్డుకునే విషయంలో క్రికెట్ ఆట ముగిసిందని, ఇక పార్లమెంటులో చెడుగుడు ఆడుతామని ఆయన అన్నారు.

పార్లమెంటులో ఏ బిల్లు కూడా ఆమోదం పొందకుండా చేస్తామని ఆయన అన్నారు. తమకు భయపడే తెలంగాణ బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారని ఆయన అన్నారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలను రెండు రోజుల ముందే ముగించుకున్నారని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదింపజేసుకుని సరిపుచ్చుతారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడానికి ఇది సరైన సమయం కాదని నిన్ననే చెప్పానని ఆయన అన్నారు. సరైన సమయంలో సుప్రీంకోర్టులో వేసేందుకు పిటిషన్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

మెజార్టీ ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా తెలంగాణపై కేంద్రం ముందుకెళ్తోందని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు రేపు సీమాంధ్ర జిల్లాలో సమైక్య పరుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు లగడపాటి చెప్పారు. సమైక్య రన్‌లో సీమాంధ్ర మంత్రులు పాల్గొంటారని ఆయన చెప్పారు.

Lagadapati Rajagopal

అసెంబ్లీ తిరస్కరించిన తెలంగాణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ముందున్న కర్తవ్యం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే అని స్పష్టం చేశారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకత వస్తుందని మంత్రి గంటా ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త పార్టీ గురించి తాము ఆలోచన చేయడం లేదని, రాష్ట్ర సమైక్యత కోసమే కృష్టి చేస్తామని ఆయన చెప్పారు. బిజెపి, సమాజ్‌వాదీ పార్టీలతో పాటు వివిధ పార్టీలు వ్యతిరేకిస్తున్నందున బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందదని ఆయన అభిప్రాయపడ్డారు.

జివోఎం సభ్యులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించదని, రాష్ట్ర విభజన జరగదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నాలను అధిష్టానం చేయదని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై ఓ స్పష్టత వచ్చిన తర్వాత కాంగ్రెసు పార్టీలో కొనసాగాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+