ఏపీలో అర్చకులకు ప్రభుత్వం శుభవార్త

అర్చకులకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 50 వేలకుపైగా ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఆయా దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు 15 వేల రూపాయల వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ పెంపు కారణంగా ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడుతుంది.

ఇందులో కొంత భాగాన్ని సీజీఎఫ్ నిధుల నుంచి చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. ఈ పెంపుతో పాటు మొత్తం లబ్ది పొందే అర్చకుల సంఖ్య 3,203. ఈ మేరకు వివరాలను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అర్చకులకు రూ. 15 వేల కనీస వేతనం ఇవ్వాలని సీఎం సూచించినట్లు చెప్పారు.

Priests salaries hiked in Andhra Pradesh by state govt

ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో బ్రాహ్మణులు, అర్చకులు, వేద పండితులు, వేదాధ్యయనం చేసే విద్యార్ధులకు నిరుద్యోగ భృతి ద్వారా ప్రభుత్వం మేలు చేస్తోందని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాగా, ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చుతూ ఇదివరకే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

వేదాధ్యయనం పూర్తి చేసి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయిస్తూ అక్టోబర్ నెలలో ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. నెలకు 3 వేల రూపాయల చొప్పున సంభావన రూపంలో నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 7 దేవాలయాల పరిధిలో మొత్తం 600 మంది వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించింది. సింహాచలం, కనకదుర్గ ఆలయం, అన్నవరం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, ద్వారకాతిరుమల, కాణిపాకం ఆలయాల్లో వేదాధ్యయనం చేసిన పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+