అపాయింట్ మెంట్ ఫిక్స్ : ప్రధానితో రేపు టీడీపీ ఎంపీల భేటీ..
న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోన్న నేపథ్యంలో.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఈ మేరకు టీడీపీ ఎంపీలంతా కలిసి ప్రధాని మోడీకి హోదా ఆవశ్యకత గురించి వివరించాలని నిర్ణయించుకున్నారు.
కాగా, ఇందుకోసం మోడీ అపాయింట్ మెంట్ కోరిన టీడీపీ ఎంపీలకు.. తాజాగా అపాయింట్ మెంట్ ఫిక్స్ అయింది. శుక్రవారం మధ్యాహ్నాం 12.30 గం.లకు ప్రధానితో భేటీకి టీడీపీ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఖరారైంది. ప్రధాని కార్యాలయ వర్గాల నుంచి ఈ మేరకు టీడీపీ పార్లమెంటరీ కార్యాలయానికి సమాచారం అందింది.

అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో.. ప్రత్యేక హోదా అవసరం గురించి ప్రధానికి వివరించనున్నారు టీడీపీ ఎంపీలు. హోదా లేకపోతే ఏపీ ఏవిధంగా నష్టపోతుంది అన్న వివరాలను కూడా ప్రధానికి వివరించే యోచనలో ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications