విజయ్ గారూ..: సాయిరెడ్డికి ప్రధాని ప్రాధాన్యత: మోదీకి అంతలా ఎలా దగ్గరయ్యారంటే..!
పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని మోదీ..వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డిని ప్రత్యేకంగా పలకరించారు. అఖిల పక్ష సమావేశం తరువాత పార్టీ అధ్యక్షుడు అమిత్ షా..మంత్రులతో కలిసి వెళ్లి పోతున్న ప్రధానికి అక్కడ ఇతర నేతలతో కలిసి నిలబడిన విజయ సాయిరెడ్డి కనిపించారు. వెంటనే హా..విజయ్‌గారూ అంటూ కరచాలనం చేసి ముందుకు సాగారు. ఇది..దీంతో..ప్రధాని స్వయంగా ఒక పార్టీ ఎంపీని పేరుతో పిలకరించటంతో ఆయనకు ఎందుకంత ప్రాధాన్యత అనే చర్చ మొదలైంది. అసలు..ప్రధాని దగ్గర సాయిరెడ్డికి అంతగా గుర్తింపు ఎందుకంటే...
జగన్ దూతగా ప్రధాని వద్ద..
ఏపీలో చంద్రబాబును తన వ్యూహాలతో ట్రాప్ చేసిన వైసీపీ అధినేత జగన్ అదే సమయంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలు కోరుకున్నారు. దీని కోసం తాను పాదయాత్రకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న సమయంలోనే ఏపీలో జరుగుతన్న వ్యవహారాలు..అవినీతి పైన ఒత్తిడి ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న అవినీతి పైన విజయ సాయిరెడ్డి కేంద్రానికి పూర్తి సమాచారం ఇచ్చారు.

కేంద్రంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు... అవసరమైన సమయంలో వారికి మద్దతుగా నిలిచే సందర్బాల్లోనూ జగన్ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నేరుగా ప్రధాని .. అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. విజయసాయిరెడ్డి ప్రధానితోనే కాదు..కేంద్రంలో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారో ముందుగానే గ్రహించి..ఆ నిర్ణయాలను అనుగుణంగా అడుగులు వేసేవారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం విజయ సాయిరెడ్డి ఫర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బయటకు వెళుతూ లాబీలో శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కోసం నిరీక్షిస్తున్న నన్ను చూసి 'హాయ్ విజయ్ గారు' అని పలకరిస్తూ నావైపుకు అడుగులు వేసి నాతో కరచాలనం చేశారు. ఊహించని ఈ ఘటన నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం. pic.twitter.com/7zfxU6xewK
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 19, 2019
కేంద్రంలో వైసీపీ మౌత్ పీస్‌గా..
వైసీపీ నుండి తొలి రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి. ఏపీలో బీజేపీ మీదకు నెపాలు నెట్టేసి రాజకీయంగా చంద్రబాబు ఎలా లాభపడాలనుకుంటున్నారనే విషయాన్ని ముందుగానే మోదీ..షా దృష్టికి తీసుకెళ్లింది విజయ సాయిరెడ్డి. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నిక..ట్రిపుల్ తలాక్ బిల్లు..జీఎస్టీ..ఉప రాష్ట్రపతి ఎన్నిక వంటి విషయాల్లో జగన్ మౌత్ పీస్ గా సాయిరెడ్డి ప్రధాని..షా ప్రతిపాదనలకు మద్దతు తెలపటంలో కీలకంగా వ్యవహరించారు.
కొద్ది రోజుల క్రితం శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చిన ప్రధానికి స్వాగతం పలికే సమయంలో సాయిరెడ్డిని ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ రాజ్యసభ సభ్యుడ విజయ సాయిరెడ్డిని ఆనవాయితీ ప్రకారం పరిచయం చేయబోయారు. ఆ సమయంలో ప్రధాని సైతం సాయిరెడ్డి నాకు తెలియదా..అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ సంఖ్యా బలం సభలో ఎక్కువగా ఉన్న సమయం లోనూ ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారి కంటే సాయిరెడ్డి ఎక్కవగా చొరవ తీసుకొని తన అభిప్రాయాలను చెప్పటంతో ప్రధాని ఆయన్ను గుర్తించారు.












Click it and Unblock the Notifications