వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరీక్ష పాసవ్వాలంటే ఆ పని చెయ్యాలన్న ప్రిన్సిపాల్ .. వేధింపులపై గిరిజన విద్యార్థిని ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

మహిళలు,బాలికల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా నిత్యం మహిళలు, బాలికల మీద లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైంగిక దాడులకు చెక్ పెట్టడం కోసం దిశా చట్టం తీసుకొచ్చినా కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రాక్టికల్ పరీక్ష రాయడానికి వచ్చిన ఓ గిరిజన విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేని విద్యార్థిని గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం దరి మూరుమూల గిరిజన తండా కు చెందిన విద్యార్థిని కాకినాడలో నర్సింగ్ చదువుతోంది.

ప్రాక్టికల్ పరీక్షలు రాయటానికి వెళ్ళిన విద్యార్థినిపై లైంగిక వేధింపులు

ప్రాక్టికల్ పరీక్షలు రాయటానికి వెళ్ళిన విద్యార్థినిపై లైంగిక వేధింపులు

ప్రస్తుతం మూడో సంవత్సరం నర్సింగ్ కోర్స్ చేస్తున్న సదరు గిరిజన విద్యార్థినిపై ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్న కళాశాల ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేశారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం గాజువాక షీలా నగర్ లోని మదర్ థెరిస్సా నర్సింగ్ కళాశాలకు వెళ్లాలని యాజమాన్యం సూచించింది. ఇటీవల పరీక్షలు రాయడానికి వెళ్లిన విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపల్ ఎం వెంకట్రావు లైంగిక వేధింపులకు గురి చేశాడు. తాను చెప్పినట్టు నడుచుకోక పోతే పరీక్ష పాస్ అవ్వకుండా ఫెయిల్ చేస్తానని బెదిరించడంతో పాటు ఆమెను శారీరకంగా ఇబ్బంది పెట్టారు.

ఒళ్లంతా మసాజ్ చేయించుకున్న ప్రిన్సిపాల్ .. ఆపై

ఒళ్లంతా మసాజ్ చేయించుకున్న ప్రిన్సిపాల్ .. ఆపై

ఒకేరోజు మూడుసార్లు ఒళ్లంతా మసాజ్ చేయించుకున్న సదరు ప్రిన్సిపాల్, విద్యార్థినిని తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడని విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోదరుడితో కలిసి గాజువాక పోలీస్ స్టేషన్ కి వెళ్లిన విద్యార్థిని సదరు ప్రిన్సిపల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగిక వేధింపులకు గురి చేసిన తీరును పోలీసులకు చెప్పి కన్నీటి పర్యంతమైంది. దీంతో పోలీసులు ప్రిన్సిపల్ వెంకట రావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది.

ప్రిన్సిపాల్ పై చర్యలకు డిమాండ్ చేస్తున్న గిరిజన సంఘాలు

ప్రిన్సిపాల్ పై చర్యలకు డిమాండ్ చేస్తున్న గిరిజన సంఘాలు

విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకుడే , కళాశాల ప్రిన్సిపాల్ గా విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాల్సిన వ్యక్తి ఈ విధంగా దారుణానికి ఒడిగట్టడం అత్యంత హేయమైన చర్య. ఇక గిరిజన విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.

English summary
sexual assault of a principal came to light when the victim who was a nursing student files a complaint in Gajuwaka police station. A principal in gajuwaka, has sexually assaulted a student while she went for the practical exams in that college.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X