కూటమి సర్కార్ కు కోవర్డుల తలనొప్పి ? సీఎం, మంత్రుల ఆదేశాలూ బేఖాతర్.. !
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోయి రెండు నెలలు కావస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం అక్రమాలను తవ్వితీసే పనిలో ఉంది. ముఖ్యంగా రంగాల వారీగా శ్వేతపత్రాల రూపంలో గత ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇందులో కీలక స్ధానాల్లో ఉన్న కొందరు అధికారుల నుంచి ప్రభుత్వానికి సహకారం అందడం లేదని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో రాజ్యమేలిన వీరే ఇప్పుడు తమ హవా కొనసాగిస్తున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని భావించింది. అయితే అందుకు కావాల్సిన గణాంకాలను ప్రభుత్వంలో భాగమైన మంత్రులు, ముఖ్యమంత్రికి అందించాల్సింది మాత్రం అధికారులే. కానీ వారిలో కొందరు అలా చేయలేదు. రకరకాల సాకులు చెప్పి గత ప్రభుత్వ లెక్కలు ఇవ్వకుండా కాలం గడిపేస్తున్నారు. దీంతో ప్రభుత్వం సకాలంలో శ్వేతపత్రాలు విడుదల చేయలేకపోయింది.

ఇలా శ్వేతపత్రాలు ఆలస్యం కావడంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్దితుల్లో సభలోనే వాటి విడుదలకు ప్రభుత్వం సిద్దమైంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మద్యం, శాంతిభద్రతలు, ఆర్ధిక వ్యవస్ధపై శ్వేతపత్రాలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. దీంతో పాటు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమధానాలు చెప్పాల్సి ఉంది. వీరికి కావాల్సిన సమాచారం కూడా పూర్తిస్ధాయిలో అందడం లేదని తెలుస్తోంది. దీంతో ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే స్పీకర్, మండలి ఛైర్మన్ పూర్తి సమాచారంతో రావాలని అధికారుల్ని ఆదేశించినా వారు తమ శైలిని మార్చుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం తలపట్టుకుంటోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications