టీ రాముడు కెసిఆర్: సొంతంగానే, దీక్షాదివస్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష చేసి, 2009 డిసెంబర్ 29వ తేదీన కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ దీక్షా దివస్‌ను పాటించింది. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో తెరాస నేతలు పాల్గొన్నారు.
సీనియర్ నేత కె. కేశవరావుతో పాటు శాసనసభ్యుడు కెటి రామారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతుందనే దీమా ఏర్పడిన నేపథ్యంలో తమ పార్టీ ప్రాబల్యాన్ని చాటుకుని, తమ వల్లనే రాష్ట్రం ఏర్పాటైందనే విషయాన్ని చాటి చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని తెరాస నిర్వహించినట్లు కనిపిస్తోంది.
కాగా, తమ పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయకూడదని కెసిఆర్‌పై ఒత్డతిడి వస్తోందని కెటిఆర్ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కెసిఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందనే భావన వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. ఆయన మాటలను బట్టి కాంగ్రెసులో విలీనం కాకుండా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలనే వ్యూహంలో భాగంగానే దీక్ష దివస్ నిర్వహించినట్లు కనిపిస్తోంది.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై జరిగిన దాడిని తిప్పికొట్టిన ఘనత మలిదశ ఉద్యమంతోనే సాధ్యమైందని కెటిఆర్ అన్నారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేని పరిస్థితి నుంచి తెలంగాణ అంటే ఆత్మగౌరవం అనే స్థాయికి తీసుకుని వచ్చిన ఘనత తమ పార్టీదేనని ఆయన చెప్పుకున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో తెలంగాణకు వచ్చే వాటాను దక్కించుకునేందుకు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ రాముడు కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును శ్రీకృష్ణుడిగా చిత్రించిన పోస్టరును దీక్షా దివస్ సందర్భంగా ప్రదర్శించారు. కెసిఆర్ తెలంగాణ కోసం దీక్ష చేపట్టి నాలుగేళ్లవుతున్న సందర్భంగా తెరాస దీక్షా దివస్ నిర్వహించింది.

ఆటాపాటా..
దీక్షా దివస్ సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమంలో తెలంగాణ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి ప్రదర్శనలు కీలక పాత్ర పోషించాయి.

కెసిఆర్ పోస్టర్‌కు క్షీరాభిషేకం..
దీక్షా దివస్ సందర్భంగా కెసిఆర్ చిత్రపటానికి అభిమానులు, తెరాస కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. కెసిఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతుందనే సందేశాన్ని వాళ్లు పంపాలని అనుకుంటున్నారు.

తెరాస జెండా ఇలా..
కెసిఆర్ చిత్రపటం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) జెండాను ప్రదర్శించే ప్రయత్నం చేసారు. నిలువెత్తు కెసిఆర్ చిత్రపటం వద్ద ఇలా..

కేశవరావు, కెటిఆర్ ఇలా..
తెరాస దీక్షా దివస్ సందర్భంగా పార్టీ సీనియర్ నేత కె. కేశవరావు, కెటి రామారావు ఇలా కూర్చున్నారు. కేశవరావు తెరాసకు కీలకమైన నేతగా ముందుకు వచ్చారు.

కెసిఆర్ దీక్షా చిత్రంతో..
కెసిఆర్ తెలంగాణ కోసం దీక్ష చేసి ఇలా బలహీనంగా మారిన చిత్రాన్ని పోస్టర్‌గా వేసి, తెరాస దీక్షా దివస్‌ను నిర్వహించింది. ఆయన దీక్ష ఫలితంగా 2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి హోం మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేశారని తెరాస
చెప్పదలుచుకుంది.

రాముడి అవతారంలో ఇలా..
రాముడి అవతారంలో కెసిఆర్ కటౌట్ ప్రదర్శించారు. తన రామబాణం వంటి దీక్షను సంధించి తెలంగాణను సాధించారని చెప్పదలుచుకున్నట్లు కనిపిస్తోంది.

అమ్మాయిల ఆటాపాటా..
తెరాస నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో అమ్మాయిలు ఆటా పాటా ఇలా.. తెలంగాణలో పాటలు సెలయేరుల్లా జాలువారుతాయి.












Click it and Unblock the Notifications