వ్యభిచారం ముఠాలు: యువతులు, విటుల పట్టివేత
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మోతీనగర్ కబీర్‌నగర్ బస్టాప్ సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున ఇంటిపై మంగళవారం పోలీసులు దాడులు చేసి నిర్వాహకులు ఎ రజని, మహ్మద్ బుద్దులతో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను రెస్కూ హోంకు తరలించారు.
ఇదిలావుంటే, హైదరాబాదులోనే మరో నాగోల్ అరుణోదయ కాలనీలో ఒక ఇంటిపై దాడిచేసి నెల్లూరు జిల్లాకు చెందిన వివేక్‌సాగర్, అనూషలను, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆ యువతిని రెస్కూ హోంకు తరలించారు.

బాలికపై అత్యాచార యత్నం
కాగా, హైదరాబాదులోని పాతబస్తీలో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని బహదూర్‌పురా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారంనాడు అతన్ని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని కిషన్‌బాగ్‌లోని అసద్ బాబా నగర్‌కు చెందిన సల్మాన్ ఖుర్షీద్ (32)గా గుర్తించారు.
ఈ నెల 6వ తేదీన అదే ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల వయస్సు గల బాలికపై ఖుర్షీద్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. స్థానికుల రాకను గమనించి అతను పారిపోయాడు. పరారీలో ఉన్న ఖుర్షీద్‌ను పోలీసులు మంగళవారంనాడు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications