సూసైడ్ నోట్ లభ్యం: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హైదరాబాద్‌కు పూజిత

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సజీవదహనమైన పూజిత కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా, మరేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హైదరాబాద్ వచ్చినట్లు ఆ వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి. ఆమె రాసిన సూసైడ్ నోట్ బాయ్ ఫ్రేండ్ అక్షయ్ షర్ట్ జేబులో లభించినట్లు తెలుస్తోంది. పూజిత ఆ షర్ట్ కొని బాయ్‌ఫ్రెండ్‌కు బహుమతిగా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆ షర్ట్ జేబులోనే ఆమె సూసైడ్ నోట్ పెట్టారని సమాచారం. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెబుతున్నారు. విజయవాడ నుంచి పూజిత హైదరాబాద్ రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆమె బాయ్ ఫ్రెండ్ అక్షయ్ బీహార్‌కు చెందినవాడు. విజయవాడలో సిఎ రెండో సంవత్సరం చదువుతున్న పూజిత ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. సిఎ కోచింగ్ ఆమె హైదరాబాదులోని తీసుకుంది.

పూజిత శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాణాలు ఉండగానే ఆమె ఒంటికి నిప్పు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఆమె కడుపులో సాంబార్ రైస్, బ్రెడ్ మాత్రమే కనిపించిందని అంటున్నారు. మిగతా వివరాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు విసరాను పంపించినట్లు చెబుతున్నారు. సిఎలో విఫలమై, ఉద్యోగం రాకపోవడంతో పూజిత మనస్తాపానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి.

Pujitha suicide note found in her house

హైదరాబాదులోని పంజాగుట్టలో సజీవ దహనమైన మహిళను పూజితగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. పూజిత స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగామ. పూజిత విజయవాడలో సీఏ చదువుతోంది. పూజిత తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. పూజిత సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెది ఆత్మహత్యనా, హత్యనా అనే విషయాన్ని తేల్చుకునే పనిలో వారు పడ్డారు.

నగరం నిద్రపోతున్న వేళ.. ఓ యువతి అనుమానాస్పదస్థితిలో సజీవ దహనానికి గురైందంటూ తొలుత వార్తలు వచ్చాయి. నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట కాలనీలోని ఐఏఎస్ క్వార్టర్స్ పార్కులో ఈ దారుణం చోటుచేసుకుంది. పంజాగుట్ట కాలనీ ఐఏఎస్ క్వార్టర్స్‌లోని జీహెచ్‌ఎంసీ పార్కులో శుక్రవారం ఉదయం పూర్తిగా కాలిపోయిన ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+