కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు సంగ‌తి త‌ర్వాత‌... మెజారిటీ తగ్గించ‌గ‌లిగితే అదే గొప్ప‌!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే నియోజ‌క‌వ‌ర్గాలు రెండున్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాలున్న‌ప్ప‌టికీ ఆ రెండింటికి మాత్రం కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌త్యేక చ‌రిత్ర ఉంది. వీటిల్లో పోటీకి నిల‌బ‌డ్డ అభ్య‌ర్థుల‌ను ఓడించ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రిగాయికానీ ఏవీ విజ‌య‌వంతం కాలేదు. అవే కుప్పం, పులివెందుల‌.

 కుప్పం నుంచి వరుసగా 7సార్లు..

కుప్పం నుంచి వరుసగా 7సార్లు..


చంద్ర‌బాబునాయుడి సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లా కుప్పం. ఇక్క‌డి నుంచి ఆయ‌న వ‌రుస‌గా గెలుపొందుతూ వ‌స్తున్నారు. ప్ర‌తిసారీ ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆయ‌న్ను ఓడించ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయికానీ విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఏడుసార్లు విజ‌యం సాధించిన చంద్రబాబును ఈసారి ఓడించి 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు 175 నియోజ‌క‌వ‌ర్గాలు గెలుచుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకనుగుణంగానే ముందునుంచే స్థానికంగా బలమైన టీడీపీ నేతలను పార్టీలోకి చేర్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగావేసింది.

 వైఎస్ కుటుంబానికి పెట్టనికోట.. పులివెందుల

వైఎస్ కుటుంబానికి పెట్టనికోట.. పులివెందుల


క‌డ‌ప జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుటుంబానికి పెట్ట‌ని కోట‌. వైసీపీ స్థాపించిన ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రెండుసార్లు ఇక్క‌డినుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తూ వ‌స్తున్నారు. వీరి కుటుంబం నుంచి ఏ పార్టీ త‌ర‌ఫున పోటీచేసినా వారి విజయం ఖాయం. రాయలసీమతోపాటు పులివెందులలో కూడా జ‌గ‌న్ ను ఓడించి రాష్ట్రంలో 160 నియోజ‌క‌వ‌ర్గాల‌ను కైవ‌సం చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో తెలుగుదేశం పార్టీ ఉంది. 1962లో జరిగిన ఎన్నికల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన చవ్వా బాలిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెంచికల బసిరెడ్డిపై గెలుపొందారు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీ, వైసీపీ మాత్రమే ఇక్కడ గెలుపు పాగా వేయగలిగాయి.

మెజారిటీ తగ్గించగలిగితే చాలు

మెజారిటీ తగ్గించగలిగితే చాలు


రాజ‌కీయ నాయ‌కుల విశ్లేష‌ణ ప్ర‌కారం కుప్పంలో కానీ, పులివెందుల‌లో కానీ చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై గెలుపొంద‌డం క‌ష్ట‌సాధ్య‌మ‌ని, వీలైతే మెజారిటీ త‌గ్గించ‌గ‌లుగుతారేమోకానీ ఇత‌ర పార్టీలు పాగా వేయ‌డం క‌ష్ట‌మంటున్నారు. కుప్పంలో వరుసగా రెండుసార్లు బాబుపై పోటీచేసిన చంద్రమౌళి మరణించడంతో ఆయన కుమారుడు భరత్ ను అభ్యర్థిగా వైసీపీ ఖరారు చేసింది. పులివెందులలో వరుసగా టీడీపీ తరఫున పోటీచేస్తోన్న సతీష్ రెడ్డి పార్టీకి దూరంగా ఉండటంతో బీటెక్ రవికి టికెట్ కేటాయించింది. ఈ రెండు పార్టీలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాయా? లేదంటే మెజారిటీని తగ్గించగలుగుతాయా? అనేది తెలియాలంటే కొద్దికాలం వేచిచూడక తప్పదు.!!

English summary
After the victory in Kuppam and Pulivendula constituencies... it would be great if the majority could be reduced!!There are political analysts in the concept.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X