చెవిరెడ్డికి పులివర్తి నాని సవాల్ ..దమ్ముంటే అక్కడ కూడా రీ పోలింగ్ పెట్టించు
Recommended Video
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చెవి రెడ్డి భాస్కర్ రెడ్డిపై సవాల్ విసిరారు . చంద్రగిరి రీ పోలింగ్ విషయంలో ఈసీ తీరును నిరసిస్తూ ఆందోళన చేసిన టీడీపీ నేతలు రీ పోలింగ్ జగన్ కుట్రగా అభివర్ణించారు . టీడీపీ సైతం పోలింగ్ జరిగిన మరుసటి రోజునే ఫిర్యాదు చేసిందని అయితే ఇప్పటికీ ఈసీ స్పందించకపోవటం ఏమిటి అంటూ నిలదీశారు. చంద్రగిరి నియోజవర్గంలో తాము ఫిర్యాదు చేసిన స్థానాల్లో రీ పోలింగ్ ఎందుకు పెట్టటం లేదని ప్రశ్నించారు. చెవిరెడ్డి కి దమ్ముంటే తుమ్మలగుంట లోనూ , ఆ నాలుగు గ్రామాల్లో కూడా రీ పోలింగ్ పెట్టించాలని పులివర్తి నాని సవాల్ విసిరారు .

బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తూ టీడీపీకి బలమైన స్థానాల్లో రీపోలింగ్ కి ఆదేశాలు తెప్పించిందని ఆరోపణ
చంద్రగిరిలో పోలింగ్ సందర్భంగా బ్రాహ్మణపట్టు, కాలేపల్లె, నడవలూరు, కుప్పంబాదూరుల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని, ఆయా స్థానాల్లో రీపోలింగ్ జరిపించాలని పోలింగ్ మరుసటి రోజునే తాము ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు పులివర్తి నాని . మరి పోలింగ్ ముగిసి 34 అవుతున్న ఈ సమయంలో వైసీపీ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును ఎలా స్వీకరిస్తారని ఎన్నికల కమిషన్‌పై మండిపడ్డారు. వైసీపీ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తూ చంద్రగిరి రీ పోలింగ్ కు ఈసీ ద్వారా ఆదేశాలు తెప్పించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చెవిరెడ్డివి చీప్ ట్రిక్స్ .. దమ్ముంటే అక్కడ కూడా రీపోలింగ్ పెట్టించు అని టీడీపీ అభ్యర్థి నాని సవాల్
చెవిరెడ్డి ఓటమి భయంతోనే ఈ విధంగా చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు పులివర్తి నాని . వైసీపీ అక్రమాలకు పాల్పడిన పోలింగ్ కేంద్రాల్లో ఎందుకు రీపోలింగ్ పెట్టడం లేదని ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. మా ఊరులో రీపోలింగ్ పెడితే భయం లేదు, నేను న్యాయానికి కట్టుబడి ఉంటా. మరి చెవిరెడ్డికి దమ్ముంటే తుమ్మలగుంటలో రీపోలింగ్ పెట్టించాలని సవాల్ విసిరారు. తుమ్మలగుంటలోనే కాదు చెవిరెడ్డి కి దమ్ముంటే ఆ నాలుగు గ్రామాల్లో కూడా రీ పోలింగ్ పెట్టించాలని పులివర్తి నాని సవాల్ విసిరారు .

టీడీపీ చేసిన ఫిర్యాదు కనపడలేదా .. సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఈసీ చూడలేదా ?
వైసీపీ బ్రాహ్మణపట్టు, కాలేపల్లె, నడవలూరు, కుప్పంబాదూరుల్లో పాల్పడిన అక్రమాలను బూత్‌లలో సీసీ కెమెరాల క్లిప్లింగ్స్ కూడా చూడమన్నామని చెప్పిన నాని ఎన్నికల అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . తుమ్మలగుంటలో రిగ్గింగ్ జరుగుతోందని విషయం తెలిసి తన సతీమణి సుధ అక్కడికి వెళితే వాహనం అద్దాలు పగులగొట్టి టీడీపీ, మీడియా శ్రేణులపై చెవిరెడ్డి అనుచరులు దాడులకు పాల్పడ్డారని నాని ఫైర్ అయ్యారు. ఇదంతా ఎన్నికల అధికారులకు కనిపించలేదా అని ప్రశ్నించారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications