చిత్తూరు:పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా అనీషారెడ్డి...స్వయంగా ప్రకటించిన చంద్రబాబు

చిత్తూరు:చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా అనీషారెడ్డి పోటీచేస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.

శుక్రవారం రాత్రి విజయవాడలోని ఉండవల్లిలో టిడిపి శ్రేణులతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు గత కొన్ని నెలలుగా సిఎం చంద్రబాబు గట్టి కసరత్తే చేస్తున్నారు. ఈ క్రమంలో అనూషారెడ్డి అనూహ్యంగా తెరమీదకు రావడమే కాదు ఏకంగా సీటు కన్ ఫర్మ్ చేసుకోవడం...అది కూడా పార్టీ అధినేతే స్వయంగా ఆ విషయం వెల్లడించడం విశేషం.

ఇప్పుడు...హాట్ టాపిక్

ఇప్పుడు...హాట్ టాపిక్

నూతనకాల్వ అనీషారెడ్డి...ఇప్పుడు ఈ పేరు ఎపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కారణం...సీట్ల కోసం పోటీ అత్యంత ఎక్కువగా ఉన్న అధికారపార్టీ టిడిపిలో
పార్టీలోకి అలా వచ్చి ఇలా టికెట్ కన్ ఫర్మ్ చేసుకోవడమే కాదు...ఏకంగా ఆ విషయాన్ని పార్టీ అధినేత...ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రకటించడం. టిడిపి లో టికెట్లు ముందుగా ప్రకటించడమే ఒక విశేషమైతే ఇంతముందుగా ఆమె తన టికెట్ ఖరారు చేసుకోవడం తెలుగుదేశం శ్రేణుల్లో చర్చనీయాంశం అయింది.

ఎవరు...ఈ అనీషా రెడ్డి?

ఎవరు...ఈ అనీషా రెడ్డి?

కడప జిల్లా రాయచోటి మండలం బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు కె.రఘురామరెడ్డి కుమార్తె అనీషా రెడ్డి. అంతేకాదు వైసిపి ఎమ్మెల్యేగా గెలిచి టిడిపిలో చేరి మంత్రి అయిన అమరనాథరెడ్డికి ఈమె స్వయానా మరదలు కూడా కావడం గమనార్హం. 1992లో చిత్తూరు మాజీ ఎంపీ ఎన్‌.రామకృష్ణారెడ్డి ద్వితీయ కుమారుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి అమరనాథ్‌రెడ్డి సోదరుడు ఎన్‌.శ్రీనాథరెడ్డితో ఆమెకు వివాహం జరిగింది. ఈమె ఎల్ఎల్ బి చదివారు. పుంగనూరుకు వైసీపీ నుంచి సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా...ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తున్న చంద్రబాబు టీటీడీ పాలక మండలి సభ్యుడు బాబు రెడ్డి ఈ టికెట్ కోసం రేసులో నిలిచినా అనీషా అభ్యర్థిత్వానికే మొగ్గుచూపడం గమనార్హం.

పెద్ది రెడ్డికి...గట్టిపోటీ తప్పదా?

పెద్ది రెడ్డికి...గట్టిపోటీ తప్పదా?

పదేళ్లుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యక్తిగతంగా కంచుకోటలా మారిన పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీకి పూర్వవైభవం సాధించి తీరాలని ఆ పార్టీ అధిష్ఠానం పట్టుదలతో ఉంది. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి పెద్దిరెడ్డి ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని ఉవ్విళ్లూరుతోంది. తదనుగుణంగా స్వయంగా తానే గట్టి కసరత్తు చేసిన సిఎం చంద్రబాబు ఎట్టకేలకు అందుకు సరైన అభ్యర్థిగా మంత్రి అమరనాథరెడ్డి మరదలు అనూషారెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిని ఢీకొనాల్సిరావడం అనివార్యంగా మారనుంది.

రాజకీయ ప్రస్థానం...ఫుల్ సపోర్ట్

రాజకీయ ప్రస్థానం...ఫుల్ సపోర్ట్

అనీషా రెడ్డి పుట్టినిల్లు కడప జిల్లా రాయచోటి మండలం బాలిరెడ్డిగారిపల్లె. ముత్తాత గంగిరెడ్డి స్వాతంత్ర్యానికి పూర్వమే కడప జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పనిచేయగా.. తాత నారాయణరెడ్డి రాయచోటి సమితి అధ్యక్షుడిగా, తండ్రి రఘురామిరెడ్డి స్వగ్రామానికి సర్పంచిగానూ, సింగిల్‌విండో అధ్యక్షుడిగానూ పనిచేశారు. న్యాయశాస్త్రం అభ్యసించిన అనూషారెడ్డికి తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఇటీవల సిఎం తిరుమల పర్యటనలో ఆయనను కలిసిన మంత్రి అమరనాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథరెడ్డి దంపతులతో విజయవాడ వచ్చి కలవాలని ఆయన సూచించారు. ఆ మేరకు శ్రీనాథరెడ్డి, అనూష విజయవాడ వెళ్లి సిఎంను కలవగా అనీషాను పుంగనూరు పార్టీ ఇన్‌చార్జిగా నియమిస్తామని, టికెట్‌ కూడా ఇస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని స్పష్టం చేశారు. పార్టీపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఇలా అనీషా రెడ్డి అనూహ్యంగా తెరమీదకు వచ్చి ఏకంగా టికెట్ ఎగరేసుకుపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+