వైసీపీలో చేరికపై స్పందించిన దగ్గుపాటి పురంధరేశ్వరి ... ఒత్తిడి నిజమే కానీ ...
దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైసీపీని వీడి రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు అన్న వార్త ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక దగ్గుపాటి విషయంలో దగ్గుపాటి ఫ్యామిలీని ఏదైనా ఒకే పార్టీలో ఉండాలని సీఎం జగన్ చెప్పినట్లుగా వైసిపి నేతలు చెప్పిన పరిస్థితి. అయితే ముఖ్యంగా దగ్గుపాటి పురందరేశ్వరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తీసుకురావాలని,ఒకవేళ ఆమె వైసీపీ లోకి వస్తే రాజ్యసభ మెంబర్ గా బంపర్ ఆఫర్ ఇస్తామని చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలపై పురంధరేశ్వరి స్పందించారు.

అప్పుడు వైసీపీలో చేరాలని ఒత్తిడి తెచ్చింది నిజమే అన్న పురంధరేశ్వరి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి తనను చేరాలని ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. అయితే అది సార్వత్రికి ఎన్నికలకు ముందు జరిగిందని ఆమె చెప్పారు. అప్పుడు తనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరమని అడిగిన మాట వాస్తవమేనన్నారు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి. అయితే ఇప్పుడు తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేరడానికి ముందు నుండే తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అందుకు వైసీపీ నేతలు కూడా అంగీకరించారని తెలిపారు పురంధరేశ్వరి.

వైసీపీలో చేరకుంటే రాజీనామా చెయ్యాలన్న అంశం తనకు తెలీదన్న మాజీ మంత్రి
ఇక తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పురందరేశ్వరి పార్టీ మారకుంటే,దగ్గుపాటి వెంకటేశ్వర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్న విషయం గురించి మాట్లాడిన పురందరేశ్వరి ఇక ఆ విషయం తనకు తెలియదని, దగ్గుపాటి వెంకటేశ్వరరావునే అడగాలని సమాధానం చెప్పారు. ఒకపక్క వైసీపీలో దగ్గుపాటి ఫ్యామిలీ కొనసాగాలంటే బిజెపిలో ఉన్న పురంధరేశ్వరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి రావాలని వైసిపి అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి షరతు విధించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

డిప్లొమాటిక్ గా, ఆసక్తికరంగా పురంధరేశ్వరి వ్యాఖ్యలు
దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ రాజకీయ భవిష్యత్తు కోసం ఇంత కాలం వేచి చూసిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని రాజకీయాల నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు దగ్గుపాటి వెంకటేశ్వర రావు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో తొలిసారిగా స్పందించిన దగ్గుపాటి పురంధరేశ్వరి వ్యాఖ్యలు చాలా డిప్లోమేటిక్ గా, అసలేమాత్రం దగ్గుపాటి ఫ్యామిలీ నిర్ణయం ఏంటో అర్థం కాకుండా ఉండడంతో పురందరేశ్వరి చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత అన్న తర్జనభర్జన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది.

దగ్గుపాటి స్పందిస్తేనే అసలు విషయం తెలిసేఛాన్స్
ఇక దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు అని జోరుగా వార్తలు వస్తున్నాయి . దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో కొనసాగాలని భావిస్తే పార్టీలో రామనాధం బాబును తిరిగి చేర్చుకున్న తర్వాత పరిస్థితులు ఆయనకు పార్టీలో పోమ్మనకుండా పొగపెట్టాయి. దీంతో దగ్గుబాటి వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారని దీనిపై వైసీపీ ముఖ్య నేతలకు ఫోన్లోనే తన నిర్ణయాన్ని చెప్పినట్టు సమాచారం. ఇక దీనిపై దగ్గుపాటి స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications