కాల్ మనీపై చంద్రబాబుకు పురంధేశ్వరి హితవు, దారుణం: లోక్‌సత్తా జెపి

విజయవాడ/హైదరాబాద్: కాల్ మనీ - సెక్స్ రాకెట్ నిందితుల పైన నిర్భయ కేసు పెట్టాలని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదివారం నాడు డిమాండ్ చేశారు. కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాలని అభిప్రాయపడ్డారు.

నిందితుల పైన నిర్భయ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్భయ కేసులో మైనర్ నిందితుడిని విడుదల చేయకూడదని ఆమె అన్నారు. అలా చేస్తే ఓ క్రూర మృగాడిని విడుదల చేసినట్లే అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కాల్ మనీ వ్యాపారుల గుప్పెట్లో ఉన్న బాధితుల ఆస్తులను స్వాధీనం చేసుకొని తిరిగి వారికే దక్కేలా ప్రత్యేక చట్టం తేవాలని లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ శనివారం నాడు ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

 Purandeswari and JP respond on Call Money issue

వడ్డీ వ్యాపారం ముసుగులో అమాయక మహిళళను లోబర్చుకోవడం అత్యంత హేయమైన చర్య అన్నారు. దీనికి కారకులైన వారితో పాటు సహకరిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్‌తో సంబంధం ఉన్న ప్రజాప్రతినిధుల పైన కూడా నిర్భయ కేసులు పెట్టాలన్నారు.

రాజధాని నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున కాల్ మనీ సెక్స్ రాకెట్ నడుస్తున్న పోలీసు నిఘా వర్గాల దృష్టికి తీసుకు రోకపావడం వాటి వైఫల్యమే అన్నారు. టిడిపిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+