కాంగ్రెస్‌కు దగ్గుబాటి దంపతులు గుడ్‌బై, మరో 50మంది!

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పురంధేశ్వరు క్లోజ్ అనే విషయం తెలిసిందే. అయితే తెలంగాణ బిల్లు విషయంలో మాత్రం ఆమె అధిష్టానంతో తీవ్రంగా విభేదించారు. తాను సమైక్యవాదినని అయితే, విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చాక ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌కు ఘాటు లేఖ రాశారు. బిల్లులో పలు సవరణలు చేయాలని లేదంటే తాము ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. బిల్లులో అనేక లోపాలు ఉన్నాయన్నారు.
రాజీనామాకు మరికొందరు...
సీమాంధ్ర కాంగ్రెస్‌లో విభజన అంశం చిచ్చు రేపుతోంది. నేడు లోకసభలో బిల్లు ఆమోదం పొందడంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా బాటపడుతున్నారు. ఇప్పటికే మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, పార్థసారథి, గంటా శ్రీనివాస రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. అదే బాటలో కాంగ్రెస్ పార్టీకే చెందిన 50 మంది ఎమ్మెల్యేలు ఈ రాత్రికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఇక, టిడిపి ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను స్పీకర్‌కు పంపాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications