వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ చర్చిస్తే మేం స్పందిస్తాం; వైసీపీ వల్ల వ్యవస్థలు సర్వనాశనం: పురంధరేశ్వరి

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అవుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగురవేసిన పురంధరేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ, జనసేన పొత్తు పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రిజనరీ పాలనలో ఏపీ మరో శ్రీలంకగా.. ఏపీని, శ్రీలంకతో పోలుస్తూ టీడీపీ ధ్వజంప్రిజనరీ పాలనలో ఏపీ మరో శ్రీలంకగా.. ఏపీని, శ్రీలంకతో పోలుస్తూ టీడీపీ ధ్వజం

 పవన్ కళ్యాణ్ చర్చిస్తే మేం కూడా స్పందిస్తాం

పవన్ కళ్యాణ్ చర్చిస్తే మేం కూడా స్పందిస్తాం

పొత్తులతో ఉన్న రెండు పార్టీలు వేర్వేరుగా కార్యక్రమాలు చేసుకోవటంపై స్పందించిన పురంధరేశ్వరి మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ తమతో చర్చిస్తే తాము కూడా స్పందిస్తామనిపేర్కొన్నారు. ఏపీలో బీజేపీ, జనసేన కార్యక్రమాలు వేర్వేరుగా ఉన్నా ఈ రెండు పార్టీల పొత్తు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమయంలో విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నాయకులకు బిజెపిని తప్పుపట్టే అర్హత లేదని పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరిస్తామని పురంధరేశ్వరి పేర్కొన్నారు.

వైసీపీది అధికార దాహం ... అధికారంలోకి రావటమే వారి లక్ష్యం

వైసీపీది అధికార దాహం ... అధికారంలోకి రావటమే వారి లక్ష్యం


రాష్ట్రంలో అధికార దాహం తో చేసే పనులు ఏవిధంగా ఉంటాయో వైసిపి పాలనలో చూస్తున్నామని పేర్కొన్న పురందరేశ్వరి, ప్రజలకు సేవ చేయటం కన్నా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీలు పనిచేస్తున్నాయి అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పురంధరేశ్వరి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ వంతు బాధ్యతగా ధరలను తగ్గించిందని రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విషయంలో ఎందుకు తగ్గించటం లేదని పురందరేశ్వరి ప్రశ్నించారు.

ప్రతి బిజెపి కార్యకర్త దేశ సేవకు పునరంకితం కావాలన్న పురంధరేశ్వరి

ప్రతి బిజెపి కార్యకర్త దేశ సేవకు పునరంకితం కావాలన్న పురంధరేశ్వరి


రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగాయని పురంధరేశ్వరి వెల్లడించారు. బిజెపి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు పురంధరేశ్వరి దిశానిర్దేశం చేశారు. ప్రతి బిజెపి కార్యకర్త దేశ సేవకు పునరంకితం కావాలని పురంధరేశ్వరి కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో నాలుగు రాష్ట్రాలలో బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్న పురంధరేశ్వరి, ఉత్తరప్రదేశ్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని, బీజేపీ పాలన పై ప్రజలు నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు.

పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పని చెయ్యాలి

పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పని చెయ్యాలి


దేశంలో పేదల అభ్యున్నతికి ప్రధాని నరేంద్రమోడీ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్న పురంధరేశ్వరి, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని వెల్లడించారు. ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించిన ఆమె సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రకాష్ సూత్రంతో బిజెపి ముందుకు వెళుతుందని దగ్గుబాటి పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు.

English summary
Purandhareshwari, directed the party ranks on the occasion of BJP foundation Day, made key remarks on BJP Janasena alliances. YSRCP was incensed that the systems were being destroyed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X