అన్ని సీట్లకూ పోటీ: పురంధేశ్వరి టార్గెట్ చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమెఆరోపించారు.

పలాసలోని దీనదయాళ్ ప్రాంగణంలో శుక్రవారం బీజేపీ బూత్ కమిటీ మహా సమ్మేళనం నిర్వహించారు. కమిటీ సభ్యులకు ఆమె బీజేపీ లక్ష్యాలను నిర్దేశించి అనంతరం ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

పోలవరంపై అనవసర రాద్ధాంతం..

పోలవరంపై అనవసర రాద్ధాంతం..

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని, ఆ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ఇందుకు జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ ప్రతి నెల ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలిస్తున్నారని పురంధేశ్వరి చెప్పారు.

టిడిపి నేతలపై విమర్శలు

టిడిపి నేతలపై విమర్శలు

కేంద్ర ప్రభుత్వ పథకాల పంపిణీలో బీజేపీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం నాయకులు అడ్డుకుంటున్నారని, కేంద్రం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని పురంధేశ్వరి విమర్శించారు.

పొత్తుపై జాతీయ నాయకత్వానిదే.

పొత్తుపై జాతీయ నాయకత్వానిదే.


వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయమై జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లడమే తమ బాధ్యత అని పురంధేశ్వరి అన్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా 175 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను పోటీకి దింపుతామని స్పష్టం చేశారు.

రైల్వే జోన్‌పై ఇలా...

రైల్వే జోన్‌పై ఇలా...


విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ ఒడిశావాసుల అభ్యర్థనతో సాంకేతిక సమస్యలు ఉన్నాయని పురంధేశ్వరి చెప్పారు. లేకుంటే ఇప్పటికే మంజూరు అయ్యేదని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP senior leader Daggubati Purandheswari made Andhra Pradesh CM Nara Chandrababu Naidu as target.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి