భీమవరంలో పురోహిత క్రికెట్ లీగ్ .. ఫైనల్ పోరు నేడే .. ఫోర్లు , సిక్సర్ లతో అదరగొడుతున్న అయ్యగా
వారంతా పురోహితులు.. అయితే ఏం... ఎందులోనూ తక్కువ కాదని తేల్చి చెప్పడానికి క్రీడామైదానంలోకి దిగారు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని రఫ్ఫాడించేశారు . పోర్లు , సిక్సర్లతో అదరగొట్టారు. వేద మంత్రాల పఠనం మాత్రమే కాదు క్రీడామైదానంలో ఆటల్లోనూ తమకు తామే సాటి నిరూపించుకోవడానికి పంచెలు కట్టుకుని మరి క్రీడామైదానంలోకి దిగారు. భీమవరంలోని స్థానిక ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ లీగ్ జరుగుతుంది. పంతొమ్మిది జట్లు ఈ మ్యాచ్ లో తలపడగా నేడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది .

మూడేళ్ళ కొకసారి జరిగే పురోహిత క్రికెట్ లీగ్.. హోరాహోరీగా క్రీడామైదానంలో పురోహితులు
మూడేళ్ళ కొకసారి జరిగే పురోహిత క్రికెట్ లీగ్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పురోహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాలలో పూజలు ,పునస్కారాలు చేసి నిత్యం వేద మంత్రాలతో , చక్కనైన పంచెకట్టుతో కనిపించే పురోహితులు వారిలోని క్రీడాకారులను నిద్ర లేపారు. పురోహిత ప్రీమియర్ లీగ్ లో హోరాహోరీగా తలపడ్డారు. పురోహిత క్రీడాకారులు క్రీడామైదానంలో రెచ్చిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన పురోహిత క్రికెట్ లీగ్ లో క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఒకరిని మించి ఒకరు తమ ప్రతిభను చూపెట్టారు.

నేడు ఫైనల్ మ్యాచ్ ... భీమవరంలో కొనసాగుతున్న పురోహిత క్రికెట్ లీగ్
రకరకాల క్రికెట్ మ్యాచ్లు చూసినవారు, పురోహితులు ఆడుతున్న ఈ క్రికెట్ మ్యాచ్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అయ్యగార్లా మజాకా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇక పురోహిత క్రికెట్ లీగ్ లో భాగంగా కొనసాగుతున్న మ్యాచ్ లు నేడు ఫైనల్ కు చేరుకున్నాయి.
బ్రహ్మ జోస్యుల సుబ్రహ్మణ్యం, బ్రహ్మ జోస్యుల ప్రసాద్, చందూరి కామేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ లీగ్ లో ఫైనల్ పోటీ నేడు జరగనుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి నిర్వహించే క్రికెట్ పోటీని పురోహితులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.

ఏపీ, తెలంగాణా రాష్ట్రాల నుండి క్రికెట్ పోటీల్లో పురోహితులు .. విజేత జట్టుకు 60 వేల రూపాయల నగదు
ఈసారి రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను భీమవరం సూపర్ కింగ్స్ జట్టు నిర్వహిస్తోంది. ఈ పోటీలలో ఉభయగోదావరి జిల్లాలతో పాటుగా, విశాఖ ,రాజమండ్రి, విజయనగరం , విజయవాడ, తిరుపతి, తణుకు తో పాటుగా, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని పురోహితులు కూడా పాల్గొంటున్నారు. ఇక నేడు జరగనున్న పురోహితుల క్రికెట్ లీగ్ ఫైనల్ పోటీలకు విజేతలకు బహుమతులు అందించడం కోసం హైకోర్టు న్యాయమూర్తి బి కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇక ఈ క్రికెట్ లీగ్ లో గెలిస్తే విజేత జట్టుకు 60 వేల రూపాయల నగదును అని నిర్ణయించారు.

ఫైనల్ వార్ లో పంచెకట్టుతో గ్రౌండ్ లో దూకుడు చూపిస్తున్న పురోహిత క్రీడాకారులు
ఇప్పటి వరకు జరిగిన క్రికెట్ మ్యాచ్ లలో అన్నవరం ,ధర్మగిరి ,కాకినాడ ,రాజమండ్రి జట్లు సెమీస్ కు చేరుకోగా శుక్రవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో కాకినాడ అయి భీమవరం జట్ల మధ్య జరిగిన పోటీలో కాకినాడ విజయం సాధించింది. ఇక భీమవరం 1 - ధర్మగిరి మధ్య జరిగిన పోటీలో ధర్మగిరి విజయం సాధించగా, రాజమండ్రి రాజోలు మధ్య జరిగిన పోటీలో రాజమండ్రి విజయం సాధించింది. నేడు జరుగుతున్న ఫైనల్స్ లో పురోహిత క్రీడాకారులు గ్రౌండ్ లో దుమ్ము లేపుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో అదరగొడుతూ పౌరోహిత్యమే కాదు , క్రీడల్లోనూ మాకు మేమే సాటి అని నిరూపించుకుంటున్నారు.