వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సీరియస్ , జగన్ మెచ్చుకున్న మరుసటి రోజే డిప్యూటీ సీఎం క్లాస్
ఏపి డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి రాష్ట్రంలో పనిచేస్తున్న వాలంటీర్ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు . ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సన్మానం చేసే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టింది. తాజాగా విజయనగరం జిల్లా కురుపాంలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పలువురు వాలంటీర్లపై బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఫైర్
కొంతమంది వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని, వైసిపి, సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. గురుగు బిల్లి మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాలంటీర్ భర్త ఎన్నికల్లో పోటీ చేసాడని పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ సైతం మెచ్చుకున్నారని పుష్పశ్రీవాణి రాష్ట్రంలో వాలంటీర్లకు గుర్తింపు లభించింది అంటే అది సీఎం జగన్ వల్లే అంటూ వ్యాఖ్యానించారు.

90% మంది ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తుంటే 10 శాతం వ్యతిరేక శక్తులుగా
90% మంది ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తుంటే 10 శాతం ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులుగా పనిచేస్తున్నారని పుష్ప శ్రీవాణి మండిపడ్డారు.
ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు సన్మానం చేసి, ఉగాది సందర్భంగా వారికి సేవా పురస్కారాలు అందించిన విషయం తెలిసిందే . రాజకీయాలకతీతంగా వాలంటీర్ల సేవలు చేస్తున్నారని కుల మత ప్రాంత వేదాలను పక్కనపెట్టి పనిచేస్తున్నారని, ఏపీలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధాన కర్తగా వాలంటీర్లు ఉన్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.

జగన్ మెచ్చుకున్న మరుసటి రోజే వాలంటీర్లకు క్లాస్
విమర్శలకు అతీతంగా పని చేయాలని సూచించిన జగన్ వాలంటీర్లకు సెల్యూట్ చేశారు. నిండు మనసుతో వారికి అభినందనలు తెలిపారు.
ఇది జరిగి 24 గంటలైనా కాకముందే డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి వాలంటీర్లకు క్లాస్ పీకారు . కొందరు ప్రభుత్వానికి వైయస్ జగన్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇది మంచి పద్ధతి కాదని పుష్పశ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ వల్లే వారికి గుర్తింపు వచ్చిందంటూ గుర్తు చేశారు.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications